
Nani 29 : వరుస సినిమాలతో దూకుడుమీదున్న నేచురల్ స్టార్.. నయా ప్రాజెక్ట్ ఓకే చేసిన నాని..

Nani 29 : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్లో పెట్టి యమా స్పీడ్‌గా ఆయా షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. రీసెంట్గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటించాడు నాని. ఈ సినిమా థియేటర్స్‌కు నో చెప్పి ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో నాని సరసన తెలుగమ్మాయి రీతువర్మ నటించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతోపాటు అలానే నాని ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా నాని మరో సినిమాను ఓకే చేశారు. నాని కెరీర్ లో 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న రానుంది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XfGtDy
0 Response to "Nani 29 : వరుస సినిమాలతో దూకుడుమీదున్న నేచురల్ స్టార్.. నయా ప్రాజెక్ట్ ఓకే చేసిన నాని.."
Post a Comment