-->
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన హైపర్ ఆది.. ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత రెమ్యునరేష్ తీసుకున్నాడో తెలుసా..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన హైపర్ ఆది.. ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత రెమ్యునరేష్ తీసుకున్నాడో తెలుసా..

Bigg Boss

Bigg Boss 5 Telugu: బుల్లి తెరపై రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మంచి టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు విజయవంతంగా సీజన్ 5 ను రన్ చేస్తుంది. ఇక ఈ గేమ్ షో కోసం బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది వెళ్లగా.. 5 అవుట్ ఐదుగురు అవుట్ అయ్యి బయటకు వచ్చారు. దాంతో ఇప్పుడు హౌస్ లో 14మంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో కావాల్సినంత వినోదం దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటిసభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు, అల్లర్లు, ఏడుపులు ఇలా నానా హంగామాగా ఉటుంది. ఇక బిగ్ బాస్ లో వారాంతంలో హౌస్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యుల్లో జోష్ మరింత పెంచుతుంటారు. అంతే కాదు సెలబ్రెటీలు తీసుకువచ్చి బిగ్ బాస్ లో సందడి చేస్తుంటారు నాగ్. ఈ క్రమంలోనే తాజాగా హైపర్ ఆదిని తీసుకువచ్చారు.

పోలీస్ గెటప్ లో వచ్చిన ఆది ఎప్పటిలానే తన కామెడీ తో ఆకట్టుకున్నాడు. హౌస్ లో ఉన్నవారిపై తన స్టైల్ లో పంచులు వేస్తూ అలరించాడు. అయితే ఇప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఆది  అందుకున్న రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపు 25 నిమిషాల పటు జరిగిన ఈ ఎపిసోడ్ కోసం ఆది భారీగా ఛార్జ్ చేశాడని అంటున్నారు. ఎపిసోడ్ కోసం హైపర్ ఆదికి ఏకంగా రూ.2 నుంచి రూ.3లక్షల మధ్యలో ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆది వచ్చిన ఎపిసోడ్‌కు టీఆర్ఫీ కూడా అదే రేంజ్ వస్తుందని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YMkW5w

0 Response to "Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన హైపర్ ఆది.. ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత రెమ్యునరేష్ తీసుకున్నాడో తెలుసా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel