
Nandamuri Balakrishna: బాలయ్య సినిమా కోసం పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసేపనిలో గోపీచంద్ మలినేని..

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేశారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే బాలయ్యను సింహగా, లెజెండ్‌గా చూపించిన బోయపాటి ఇప్పుడు అఖండగా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇక బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా రోమాలు నిక్కపొడుచుకునే ఫైట్స్ ఉండనున్నాయని టీజర్స్‌తోనే చెప్పేశారు బోయపాటి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇటీవలే క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపిచంద్.. ఇప్పుడు బాలయ్య కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడు..? ఆయన ఎలా కనిపించబోతున్నాడు..? అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే..బాలయ్యలోని రౌడీయిజాన్ని బయటకు తీసుకురావడానికి గోపీచంద్ ట్రై చేస్తున్నారట. టైటిల్ కూడా `రౌడీయిజం`అని అనుకుంటున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకోసం మరో పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట.. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా 107వ మూవీ.
మరిన్ని ఇక్కడ చదవండి :
Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి
Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iYXolj
0 Response to "Nandamuri Balakrishna: బాలయ్య సినిమా కోసం పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసేపనిలో గోపీచంద్ మలినేని.."
Post a Comment