
Mohan Babu : నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan Babu : మా ఎన్నిలకల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా కానీ మాలో వేదిమాత్రం తగ్గడంలేదు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైంది. మంచు విష్ణుకు 381 రాగా సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో మంచు విష్ణు 107 ఓట్లతో విజయ ధుంధుభి మోగించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో జీవితపై గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, బెనర్జీ, కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రెటరీలుగా గౌతం రాజు, ఉత్తేజ్ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది, విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్లుగా గెలుపొందారు. అందులో శివారెడ్డి అత్యధికంగా 362 ఓట్లు వచ్చాయి.
ఇక ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్ల క్రితం నేను మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యా.. ఇప్పుడు నా బిడ్డ ఎన్నికయ్యాడు అంతా దేవుడి నిర్ణయం అన్నారు. అలాగే
సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత విజృంభిస్తుంది.. సముద్రం వెనక్కి వెళ్లి ఆ తర్వాత సునామీలా తిరిగి వస్తుంది.. నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. నేను మౌనంగా ఉండాలని చెప్పారు.. అన్నీ గమనిస్తూ ఎప్పుడు సమాధానం చెప్పాలో ఎదురుచూశా అన్నారు. నోరు ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు..
నిన్నటిది వేస్ట్ పేపర్.. నేడు న్యూస్ పేపర్ .. రేపటిది క్వశ్చన్ పేపర్ అంటూ మోహన్ బాబు వేదాంతం చెప్పుకొచ్చారు. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే ఏం చేయలేం అన్నారు. మాకు అవార్డ్ ఇవ్వాలని వైఎస్‌ఆర్ సీఎం ఉండగా అడిగాం అన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.. కానీ సీఎంని సినీ పెద్దలు ఎందుకు సన్మానించలేదు.. ఏపీ సీఎంని కూడా సన్మానించాల్సి ఉండేది.. ఎందుకు చేయలేదు అని మోహన్ బాబు ప్రశ్నించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్..
Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..
Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AxFDj0
0 Response to "Mohan Babu : నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు"
Post a Comment