-->
MAA ఫలితం జాతీయవాద విజయమా.? విచ్ఛిన్నకర శక్తులు ఎన్నికల్లో పోటీ పడ్డాయా.?

MAA ఫలితం జాతీయవాద విజయమా.? విచ్ఛిన్నకర శక్తులు ఎన్నికల్లో పోటీ పడ్డాయా.?

Big News

ఎన్నికల ఫలితాలతో హర్ట్‌ అయిన నాగబాబు రిజైన్‌ చేశారు. సంకుచిత ఆలోచనలకు వేదికగా మారిన MAAలో ఉండలేనని ట్వీట్‌ ద్వారా ప్రకటించేశారు. కొద్ది గంటల తేడాలో ప్రాంతీయ, జాతీయ వాదాలు తెచ్చి తన పుట్టుకనే ప్రశ్నించారంటూ MAAతో 21 ఏళ్ల బంధాన్ని వదులుకున్నారు ప్రకాశ్‌రాజ్‌. నిజంగానే కళకు ఎల్లలు లేవని చెప్పే నటులు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారా? భాషా బేధం లేదంటూనే సరిహద్దులు గీసుకున్నారా. చిన్న అసోసియేషన్‌లోకి కూడా రాజకీయాలు ఎందుకు జోరబడుతున్నాయి. కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన పరిశ్రమలో కొందరు కావాలనే పాలిటిక్స్‌ను ప్రొత్సహిస్తున్నారా.?

ఫలితం రుచించలేదు. చివరకు MAAతోనే తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు నాగబాబు. జాతీయవాదం కూడా తెచ్చి MAA నుంచి వేరు చేశారంటూ ఆవేదనతో రిజైన్‌ చేశారు ప్రకాష్‌రాజ్.‌ సినిమా నటులు కూడా మనుషులే. వారికీ భిన్నాభిప్రాయాలు సహజం. ఎవరికి ఎలాంటి ఆలోచనలున్నా MAA మాత్రం ఒక్కటిగా ఉంది. ఇంతకాలం గుట్టుగా సాగిన సిని..మా సంసారం తాజా ఎన్నికలతో నడిరోడ్డుమీదకు వచ్చింది. ఎవరి ఇజాలు వారికున్నా.. పార్టీలతో అంటకాగినా పరిశ్రమలో ఒక్కటిగా ఉన్న నటులు ఎవరికి వారే యుమునా తీరే అయ్యారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ అఫిలియేషన్లను చర్చకు పెట్టి వాటి ఎజెండాలను తెరముందుకు తీసుకొచ్చి రెండు వర్గాలుగా చీల్చారు. రాజకీయ పార్టీల జోక్యం లేదంటునే వాటిని అంతర్లీనంగా జొప్పించారు. కళకు ఎల్లలు.. భాష లేదనే ఇండస్ట్రీలోనే ప్రాంతీయ వాదమూ ప్రధాన ఎజెండా అయింది. సరే వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నికల్లో ఇలాంటివన్నీ సహజమే అనుకుంటే.. ఏకంగా దేశ విచ్ఛిన్నకర శక్తులు ఓటమి అంటూ BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. తుకుడే గ్యాంగ్‌కు మద్దతు ఇచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగిందంటూ కూడా ఓ వర్గాన్ని పరోక్షంగా కామెంట్ చేశారు బండి.

ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా దూరి జయాపజయాలకు తమ పార్టీ విధానాలే కారణమంటూ ట్వీట్లు పేల్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రాంతీయవాదం, జాతీయవాదం అంటూ అన్నీ తీసుకొచ్చారని.. ఇండస్ట్రీలో ఇది అంతం కాదని.. ఆరంభం అంటున్నారు ప్రకాష్‌రాజ్‌.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయం సాధించిన మంచు కుటుంబం అందరికీ ధన్యవాదాలు చెప్పి… తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవారిని కూడా ఆత్మీయులు అని సంబోధించి దగ్గర కావాలనుకున్నా.. సాధ్యం కానంత దూరం ఈ ఎన్నికలతో పెరిగింది. తమ రాజకీయ, ప్రాంతీయ, జాతీయ వాదాలను కూడా అభ్యర్థులు ప్రచారం చేయడం నటుల మధ్య అంతరాన్ని పెంచింది. సిని…మా ను రాజకీయం ఆవరించింది. ఇక భవిష్యత్తులోనూ రాజకీయ జోక్యంతోనే ఎన్నికలు జరుగుతాయన్న సందేశం పంపాయా.? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి..

ఇండస్ట్రీలో ఇంతకీ పెద్ద ఎవరు.. దాసరి తర్వాత ఓ పెద్ద మనిషి లేకుండా పోయాడా… అయితే కొత్తగా నరేష్‌ వచ్చి మోహన్‌బాబు ఆ బాధ్యత తీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అంతకుముందు దాసరి తర్వాత పరిశ్రమలో పెద్దదిక్కు చిరంజీవి అయ్యారన్నారు మురళీమోహన్‌. ఇంతకీ ఎవరు పెద్ద ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ చర్చ జరిగింది…

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30gBrb0

0 Response to "MAA ఫలితం జాతీయవాద విజయమా.? విచ్ఛిన్నకర శక్తులు ఎన్నికల్లో పోటీ పడ్డాయా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel