-->
Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..

Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..

Hameeda

బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారం ముగిసింది. 19 మందితో మొదైలైన ఆటలో ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో సరయు, ఆ తర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా..నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఎలిమినేట్ అయ్యింది. ఇక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సంప్రదాయపు పంచెకట్టులో ఎంట్రీ ఇవ్వగా.. ఇంటి సభ్యులు సైతం సంప్రదాయపు దుస్తులలో అందగా రెడీ అయ్యారు. ఇక నాగార్జున ఇంటి సభ్యులకు స్పెషల్ కానుకలను ఇచ్చాడు. అలా మొత్తం తొమ్మిది ఆటలు, తొమ్మిది బహుమతులు అంటూ ఇంటి సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను చూపించాడు. ఇక ఆఖరున హమీదా ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించాడు.

ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన హమీదా.. ఒక్కొక్కరికి గురించి మంచి చెడులు చెప్పుకొచ్చింది. ముందుగా మానస్ మంచోడే కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత కాజల్ ఫేక్ అంటూ కుండబద్దలు కొట్టింది. ఆమె బంధాలకు అస్సలు విలువ ఇవ్వదని .. ఆ విషయం తనపట్ల ఆమె ప్రవర్తించిన తీరుతో అర్థమైనట్టుగా తెలిపింది. ఇక జెస్సీతో ఫ్రెండ్ షిప్ లేదని తెలిపింది. ఇక ఆ తర్వాత సిరి ఫ్లిప్ అని.. మొదట్లో బాగానే ఉండేదని.. కానీ మధ్యలో మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత షన్ను సైతం ఫ్లిప్ అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదని.. ఆమెకు నిజాంగానే ప్రేమ ఉందా ? లేదా ? అలా ఊరికే చూపిస్తుందా ? అర్థంకాదని చెప్పింది. ఇక ప్రియ తన ఫెవరేట్ అని.. కానీ తను కెప్టెన్ కాకుండా చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఉందని.. కానీ వారంలో పోయిందని చెప్పుకొచ్చింది. యానీ మాస్టర్ తన ఫెవరేట్ అని.. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తుంటాను.. ఎప్పుడూ నవ్విస్తుంటాడు సన్నీ..చాలా మంచివాడని తెలిపింది. ఇక శ్వేత కూడా చాలా మంచిదని చెప్పుకొచ్చింది. రవి తనకు అన్నయ్య అని.. ఇక విశ్వ ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు.. తెలియకుండా మాట్లాడితే.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకోలేం.. ఎదుటివారి గురించి ఎదురుచూడకుండా నువ్వే వెళ్లి మాట్లాడు..లోబో, శ్రీరామ్ మంచివాళ్లని చెప్పుకొచ్చింది.

Also Read: Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు నాగ్ స్పెషల్ సర్‏ప్రైజ్.. వెక్కివెక్కి ఏడ్చిన లోబో..

MAA elections 2021: విజయం ఇచ్చిన ఆనందం.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oXkNXY

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel