
Japanese Princess: ప్రేమ కోసం తన వారసత్వ భారీ సంపదను వదులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి

Japanese Princess Mako: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్‌మేట్‌ను ఈ నెల26న మ్యారేజ్ చేసుకోనుంది. అనేక విమర్శలు, అంతకు మించిన పరిశీలన అనంతరం జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించింది.
అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతోంది. దాని నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందట. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెట్టబోతుంది. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం జరగనుంది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలు మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. అయితే కౌమురో తల్లి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది.
వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్ము ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధమైంది. కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్‌తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్‌హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు.

Japan Princes
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mcjMbI
0 Response to "Japanese Princess: ప్రేమ కోసం తన వారసత్వ భారీ సంపదను వదులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి"
Post a Comment