-->
Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్..

Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్..

Sriramachandra

బిగ్‏బాస్ నాలుగోవారం కెప్టెన్‏గా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లగ్జరి బడ్జెట్ టాస్క్‏ ఆడిపించిన బిగ్‏బాస్.. కంటెస్టెంట్స్ మధ్యల మరోసారి ఫిటింగ్ పెట్టే ప్రయత్నం చేశాడు. గత రెండు రోజులుగా ఆకలితో అలమటించేలా చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

నిన్నటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యుల మధ్య లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టేశాడు. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులు బెస్ట్, వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది తమ అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఇందులో ఎక్కువగా బెస్ట్ పర్ఫామర్‏గా మానస్‏ను, వరస్ట్ పర్ఫామర్‏గా జెస్సీని ఎంచుకున్నారు. అనంతరం జెస్సీని జైలుకు పంపించారు. ఇక ఆ తర్వాత.. బిగ్‏బాస్ ఇంట్లో స్పెషల్ షో జరిగింది. ఈ స్పెషల్ షోకు సన్నీ వీజేగా వ్యవహరిస్తుండగా.. శ్రీరామ చంద్ర స్పెషల్ గెస్ట్‏గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక వీజే సన్నీ తనదైన స్టైల్లో శ్రీరామచంద్రను ఇంటర్వ్యూ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ క్రమంలో ముందుగా కాజల్ మైక్ తీసుకుని సిరి, హమిదాలలో ఎవరిని ఎంచుకుంటావ్ అని శ్రీరామచంద్రను ప్రశ్నించింది. దీంతో శ్రీరామ్.. లంచ్ సిరితో అని.. డిన్నర్ హమిదాతో అంటూ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో టిఫిన్ సమయానికి ఎవరు అంటూ నవ్వులు పూయించాడు సన్నీ. ఇక మంచి అమ్మాయిని కోసం వెయిటింగ్ అన్నావు… ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు అంటూ సన్నీ ప్రశ్నించగా…. ప్రియ, ప్రియాంక, శ్వేత, కాజల్, యానీ మాస్టర్, సిరిలలో ఒక్కో క్వాలిటీని చెబుతూ.. చివరకు సిరి కమిటెడ్ కాకపోయి ఉంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడినని చెప్పాడు. దీంతో పక్కనే ఉన్న రవి.. నీ టెస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ఇక మీ గుండెల్లో ఏ అమ్మాయి అయినా ఉందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం మ్యూజిక్ మాత్రమే ఉందని.. త్వరలోనే మరో అమ్మాయికి స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అనంతరం ప్రియా, ప్రియా పాట పాడుతూ.. మరోసారి ఇంటి సభ్యులను మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఆ తర్వాత ప్రియా.. ఇక్కడున్న వారిలో ఎవరిని డేట్ కు తీసుకెళ్తావ్ అని ప్రశ్నించగా.. హమిదా పేరు చెప్పేశాడు. ఆ తర్వాత ఆమెతో డ్యాన్స్ చేస్తూ ఎంతో క్లోజ్ గా మూవ్ అయ్యారు.

Also Read: Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణ‌వ్ తేజ్‌- ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ‘కొండపోలం’ ప్రమోషన్స్..

Divi Vadthya : చిలకపచ్చ ఓణిలో రామచిలక .. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iqa44s

0 Response to "Bigg Boss 5 Telugu: కమిటెడ్ కాకపోయి ఉంటే ఆమెకు ట్రై చేసేవాడిని.. మనసులో మాటలను బయటపెట్టిన శ్రీరామ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel