-->
IND vs PAK Match Twitter: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెటిజన్లు ఏమంటున్నారు.. ట్విట్టర్‌ రియాక్షన్స్‌పై ఓ లుక్కేయండి..

IND vs PAK Match Twitter: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెటిజన్లు ఏమంటున్నారు.. ట్విట్టర్‌ రియాక్షన్స్‌పై ఓ లుక్కేయండి..

Ind Vs Pak Twitter Reaction

IND vs PAK Match Twitter: టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ సంచలన విజయం సాధించింది. పాకిస్థాన్‌ ఓపెననర్లు అద్భుత ఆటతీరుతో పాక్‌ సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో భారత్‌ ఆటగాళ్లను పాక్‌ బౌలర్లు కట్టడి చేస్తే.. పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, అజమ్‌లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. అసలు ఎక్కడ తడబడకుండా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించారు. దీంతో పాకిస్థాన్‌ సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు టీ20లో ఇండియాపై భారత్‌ గెలవలేదన్న దాన్ని రూపుమాపారు. దీంతో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నారు.

సహజంగానే క్రికెట్‌ అంటే ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడుతుంది. ఈ క్రమంలోనే దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌పై కూడా అందరిలోనూ తీవ్ర ఆసక్తినెలకొంది. ఇక భారత్‌ ఘోరపరాజయం పొందడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు, అయితే మరికొందరు మాత్రం మంచి ఆట తీరును కనబరిచారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ వేదికగా కొందరు అభిమానులు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం..

ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఇదీ క్రికెట్‌ అంటే. రెండు జట్లు మంచి ఆటతీరును కనబరిచారు. మ్యాచ్‌ మొత్తం ఒక్కసారి కూడా స్లెడ్జింగ్ లేకుండా ఆటను పూర్తి చేశారు అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ పూర్తికాగానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. పాకిస్థాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ను హత్తుకున్న ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ఈ ఫోటో ఎంతగానో నచ్చింది అంటూ రాసుకొచ్చాడు. ఇక మరో యూజర్.. ఇప్పటి వరకు ఇండియా పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్‌ కప్‌లపై వచ్చిన జోక్స్‌కు ఈ రోజుతో తెరపడింది అంటూ వినూత్నంగా ట్వీట్ చేశాడు. ఇక భారత్, పాక్ మ్యాచ్ పై పలువురు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లపై ఓ లుక్కేయండి..

 

Also Read: Ritu Varma: నీలి ముత్యం‌లా మెరిసిన తెలుగు అమ్మాయి.. అందాల రీతూ లేటెస్ట్ ఫొటోస్

Rakul Preet Singh: మల్లెతీగ లాంటి ఫిజిక్ తో అందాలు వలకపోస్తున్న రకుల్ ప్రీత్

Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా..! నమ్మరేమో..మరీ



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jxcz5y

0 Response to "IND vs PAK Match Twitter: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెటిజన్లు ఏమంటున్నారు.. ట్విట్టర్‌ రియాక్షన్స్‌పై ఓ లుక్కేయండి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel