-->
IMF Report: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. వృద్ధి రేటు అంచనా 8.5 శాతం..

IMF Report: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. వృద్ధి రేటు అంచనా 8.5 శాతం..

India

IMF Report: 2022 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి రేటుకు సంబంధించిన అంచనాలను ఐఎంఎఫ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని పేర్కొంది. 2021 సంవత్సరానికి గానూ భారత్ జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతంగా పేర్కొన్న ఐఎంఎఫ్.. 2022లో 8.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని పేర్కొంది. అంతేకాదు.. 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు భారత ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం చొప్పున వృద్ధి చెందుతూనే ఉంటుందని అంచనా వేసింది ఐఎంఎఫ్. ఇక ప్రపంచ జీడీపీని 5.9 శాతంగా ప్రకటించింది. అలాగే.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 5.2 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేసింది.

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు. జూలైలో అత్యంత డౌన్‌గ్రేడ్ ఉన్నప్పటికీ జీడీపీ అంచనాలో ఇప్పటికైతే ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంది అని, వైరస్ ఇంకా పోలేదనే స్పృహతోనే ఇండియా నిర్ణయాలు చేపడుతోందని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. ఇది కూడా దేశాభివృద్ధికి సహాయకారిగా నిలుస్తోందని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.

ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఐఎంఎఫ్. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యోల్బణం రేటును 5.3 శాతంగా అంచనా వేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను ఆర్‌బిఐ 9.5 శాతంగా పేర్కొంది. అవే అంచనాలను ఐఎంఎఫ్ కొనసాగించింది.

ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 10bps తగ్గింపు..
ఐఎంఎఫ్ 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వృద్ధి రేటు అంచనాను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అదే సమయంలో 2022 కోసం వృద్ధి రేటు అంచనాను 4.9 శాతంగా నిలుపుకుంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 5.9 శాతంగా ఉంటుంది. అంతకుముందు జూలైలో, ఇది ప్రపంచ వృద్ధి రేటు అంచనాను 6 శాతంగా పేర్కొంది.

2021 చివరి నాటికి ప్రతి దేశంలో 40% వ్యాక్సినేషన్..
ఆర్థిక పునరుద్ధరణకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం అవసరం అని అవసరమని ఐఎంఎఫ్ తెలిపింది. తక్కువ ఆదాయం కలిగిన పేద దేశ జనాభాలో 96 శాతం మంది ఇప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే.. 2021 చివరి నాటికి, ప్రతి దేశ జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయించాల్సిన ఆవశ్యతక ఉందని పేర్కొంది. 2022 మధ్య నాటికి, ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.

Also read:

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నేను రూడ్ కాదంటూ సిరిపై చిందులు..

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు.. దూర ప్రయాణాలు చేసే అవకాశం

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2X4MmmK

Related Posts

0 Response to "IMF Report: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. వృద్ధి రేటు అంచనా 8.5 శాతం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel