
Hyderabad Pubs: తెల్లవార్లూ తెరిచే ఉంటున్న పబ్‌లు..ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా మారని యజమాన్యం తీరు..

Hyderabad Pub Culture: హైదరాబాద్‌లో రోజు రోజుకీ పబ్ కల్చర్ పెరిగిపోతుంది. పబ్ లు సమయంతో పనిలేకుండా తెల్లవార్లూ తెరిచే ఉంటున్నాయి. కొంతమంది పబ్ లో తాగి వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమవుతున్నా.. పబ్ యాజమాన్యం తీరు మారడం లేదంటూ నగరంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లో పబ్‌లు తెల్లవార్లూ తెరిచే ఉంటున్నాయి. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బిల్డింగ్‌లోని పూడింగ్ మింగ్ పబ్ తెల్లవారుజామున 4 గంటలైనా మూసివేయడంలేదని.. టీవీ9 నిఘాలో వెల్లడైంది. ఈ పబ్ లో స్పెషల్ ఎంట్రీ పేరుతో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు పబ్‌ను యాజమాన్యం నడుపుతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎంట్రీ పాస్ లేదని పబ్ సిబ్బంది పబ్‌లోకి అనుమతించలేదు. దీంతో ఓ వ్యక్తి సిబ్బందితో గొడవకు దిగాడు. ఇక కొంతమంది పబ్ లో తెల్లవార్లు తప్పతాగి వాహనాలు నడుపుతున్నారు. వీరు కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరుగడానికి కారణవుతున్నారు. అయినప్పటికీ పబ్ యాజమాన్యం తీరుమారడంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తీసుకోవాలంటున్న ప్రజలు.
Reporter: Vidhay Tv9 telugu
Also Read:
పునీత్ రామ్‌కుమార్ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vZRwh1
0 Response to "Hyderabad Pubs: తెల్లవార్లూ తెరిచే ఉంటున్న పబ్‌లు..ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా మారని యజమాన్యం తీరు.."
Post a Comment