
Huzurabad – Badvel By Elections 2021 Live: హుజూరాబాద్, బద్వేల్ దంగల్.. భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైన పోలింగ్..

Huzurabad – Badvel Polls Live voting: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
హుజూరాబాద్..
హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరుపున కూడా ఆ పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లల్లో మహిళలు లక్షా 17 వేల 563 మంది, పురుషులు లక్షా 18వేల 720 మంది ఉన్నారు. అధికారులు 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని మోహరించారు.
బద్వేల్..
ఏపీ బద్వేల్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. మొత్తం 3000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఈ నియోజవర్గంలో 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ, బీజేపీ పోటి నెలకొంది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3w6ay5u
0 Response to "Huzurabad – Badvel By Elections 2021 Live: హుజూరాబాద్, బద్వేల్ దంగల్.. భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైన పోలింగ్.."
Post a Comment