-->
Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర..

Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర..

Gold And Silver

Gold & Silver Price: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్‌లో పసిడి(24 క్యారెట్లు) ధర 10 గ్రాములకు 120 రూపాయలు పెరిగింది. అంటే.. ఈ రోజు మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,330 పలుకుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..రూ.44,300 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి రూ. 67,500 పలుకుతోంది. అదే సమయంలో 10 గ్రాముల వెండి రూ. 675 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,450 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,670కు చేరింది. అలాగే..దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,070కు చేరింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330 కి చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,620 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,680 కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం బంగారం ధరలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. దేశీయంగానూ ధరల మార్పులు జరిగింది.

వెండి ధరలు..
బంగారం ధర పెరిగినప్పటికీ.. వెండి దర మాత్రం స్థిరంగా ఉంది. ఇవాళ వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేదు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 675కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 67,500లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రూ. 67,500, ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ. 63,600, ముంబైలో కేజీ సిల్వర్ రూ. 63,600, ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రూ. 67,500, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ రూ. 67,500 గా ఉంది.

Also read:

Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..

Post Office: ఈ 4 పోస్టాఫీసు పథకాలలో అధిక రాబడి..! అదనంగా పన్ను మినహాయింపు

Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DSCmwS

0 Response to "Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel