-->
Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..

Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..

Nakka Anand

Andhra Pradesh: మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి వేళ వైజగ్ నుంచి వచ్చిన పోలీసులు గంజాయి అంశంపై మీడియాతో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని కోరారు. పోలీసుల తీరుపై ఆనంద బాబుతో పాటు టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే.. గుంటూరు వసంతారాయపురంలోని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖలో గంజాయి రవాణాకు సంబంధించి ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు విజయసాయిరెడ్టిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఏ ఆధారాలతో మాట్లాడారో స్టేట్‌మెంట్ రికార్డు చేసుకునేందుకు, నోటీసులు జారీ చేసేందుకు ఆనంద్ బాబు ఇంటికి విశాఖ జిల్లా నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వచ్చారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆనంద్ బాబును కోరారు. గతంలో టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రకు కూడా మాదకద్రవ్యాల గురించి మాట్లాడినందుకు కాకినాడ పోలీసులు ఇదే తరహాలో నోటీసులు ఇచ్చారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై నోటీసులు జారీ చేయటంపై ఆనంద్ బాబు విస్మయం వ్యక్తం చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని పోలీసులు ప్రశ్నించారు. తాము స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుంటామని అడిగారు. అయితే తెలంగాణ పోలీసులు వచ్చి గంజాయి స్థావరాలపై దాడి చేస్తే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ఏపి పోలీసులకు అవమానమని, అదే విషయాన్ని మీడియా ముందు చెప్పానని అన్నారు. పైగా అక్కడ గిరిజనులపై దాడి జరిగితే మాజీ మంత్రిగా మాట్లాడే హక్కు లేదా అని ఆనంద బాబు ప్రశ్నించారు.

మరో వైపు మాజీ మంత్రి ఇంటికి అర్ధరాత్రి వేళ ఇంత మంది పోలీసులు రావడంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా, టిడిపి నేతలు నసీర్, కోవెలమూడి రవీంద్ర లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు ఎత్తిన ప్రతి ఒక్కరి గొంతు నొక్కేలా నోటీసులతో ప్రస్తుత డీజీపి కొత్త సంస్కృతికి తెర తీశారని విమర్శించారు. టిడిపి ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా? అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ పైనా, పోలీసుల పని తీరుపైనా వారు మండిపడ్డారు.

ఇక, అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారని తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆనంద బాబు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో నర్సీపట్నం పోలీసులు ఆనంద్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వస్తామని తెలిపారు. అయితే, అర్దరాత్రి 15 మంది వరకు పోలీసులు మాజీ మంత్రి ఇంటికి రావడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

Also read:

Post Office: ఈ 4 పోస్టాఫీసు పథకాలలో అధిక రాబడి..! అదనంగా పన్ను మినహాయింపు

Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?

Viral Video: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది.. వైరలవుతున్న వీడియో..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3p9LHMC

0 Response to "Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel