-->
Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే..

Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే..

Bank Holidays

Bank Holidays: అక్టోబర్ నెలలో పండుగల కారణంగా దేశం వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు వరుస హాలిడేస్ వస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో బ్యాంకుకు వెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అయితే, ముందుగా మీరు బ్యాంకు హాలిడేస్‌ గురించి తెలుసుకోండి. వచ్చే వారం రోజులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండుగలు, సంబరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వాటికుండే ప్రాధాన్యత ప్రకారం బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించడం జరిగింది. వీటికి తోడు సాధారణ సెలవులు, ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో.. ఏ బ్యాంకులకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి.. ఎన్ని రోజులు బ్యాంకు తెరుచుకుని ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 18, సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారంలో ఆరు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో 11 రోజులు బ్యాంకులు మూసివేయబడ్డాయి. సిక్కింలోని గాంగ్‌టక్‌లో దుర్గా పూజ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన అంటే శనివారం నాడు దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి. అక్టోబర్ 17 ఆదివారం కావడంతో సాధారణ సెలవుగా పరిగణించి బ్యాంకులు క్లోజ్ అయ్యాయి.

బ్యాంకులకు ఫెస్టివల్ హాలిడేస్..
అక్టోబర్ 18 – అస్సాంలోని గౌహతిలో కాటి బిహు పండుగ కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 19 – మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా.. న్యూఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగవు.

అక్టోబర్ 20 – వాల్మీకి జయంతి సందర్భంగా బెంగళూరు, చండీగఢ్, సిమ్లా, కోల్‌కతా, అగర్తలాలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 22 – ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ సందర్బంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 23 – నాల్గవ శనివారం కారణంగా భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 24 – ఆదివారం కారణంగా బ్యాంకులన్నీ బంద్.

ఆన్‌లైన్ సేవలు యధాతథం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం.. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి భిన్నంగా ఉండవచ్చు. అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సెలవు దినాలలో బ్యాంక్ కార్యాలయాలు మాత్రమే మూసివేయడం జరుగుతుంది. ATM కేంద్రాలు, యధాతథంగా నడుస్తాయి. ఆన్‌లైన్ సేవలు కూడా యధాతథంగా కొనసాగుతాయి.

Also read:

Aadhaar Card: ఆధార్ సమస్యలకు చెక్ చెప్పండి.. ఇప్పుడు నిమిషాల్లో ఇ-ఆధార్ పొందండి.. అదెలాగంటే..!

Gold & Silver Price: స్థిరంగా బంగారం ధరలు… వెండి రేట్లు అలా.. హైదరాబాద్‏లో ధరలు ఇలా..

Kurnool: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vniY7S

Related Posts

0 Response to "Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel