-->
Aadhaar Card: ఆధార్ సమస్యలకు చెక్ చెప్పండి.. ఇప్పుడు నిమిషాల్లో ఇ-ఆధార్ పొందండి.. అదెలాగంటే..!

Aadhaar Card: ఆధార్ సమస్యలకు చెక్ చెప్పండి.. ఇప్పుడు నిమిషాల్లో ఇ-ఆధార్ పొందండి.. అదెలాగంటే..!

Aadhaar

Aadhaar Card: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అత్యంత కీలకం. వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆధార్ కార్డ్‌లో నిక్షిప్తమై ఉంది. అందుకే ప్రతీ అవసరానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. బ్యాంక్ ఖాతా తెరవడం, బైక్/కారు కొనడం, ఫోన్ కనెక్షన్ పొందడం, ఇలా ఏదైనా పౌరులందరూ సమర్పించాల్సిన కీలక డాక్యూమెంట్ ఆధార్. ఆధార్ కార్డు సహాయంతో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాలను తీసుకువస్తోంది. అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతుంది. ఆధార్ అనేది 12 నెంబర్లు కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. దీనిని అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది.

భారతదేశంలోని ఏ పౌరుడికైనా ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన ఐడీగా మారింది. దీనిని పొందడానికి మీరు అధీకృత ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మీ పేరు, వయస్సు, చిరునామా, బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాలి. ఈ మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు ఆధార్ నంబర్ వస్తుంది. ఇది బాల ఆధార్ కార్డ్ రూపంలో పిల్లలకు కూడా అందుబాటులో ఉంది. అయితే, పిల్లల ఆధార్ కార్డు యొక్క రంగు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది.

ఆధార్ ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి..
ఆధార్ కార్డ్ ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. అందుకే ఎల్లప్పుడు ఆ కార్డ్ వెంట ఉండాల్సిందే. అయితే, డాక్యుమెంట్ లేదా కార్డ్ తీసుకువెళ్లే బదులు, డిజిటల్ ఫార్మాట్‌లో కూడా ఆధార్ తీసుకెళ్లవచ్చు. ప్రపంచంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, దాదాపు అన్ని వస్తువులు, సేవలు నిమిషాల్లో అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఇళ్ల నుంచి కూడా అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఈ టెక్నాలజీని యూఐదీఏఐ కూడా అందిపుచ్చుకుంది. ఆధార్ సేవల కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా.. ఇళ్లలోనే ఉండి ఆధార్ పొందేలా టెక్నాలజీని రూపొందించింది.

ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..
ఈ హైటెక్ యుగంలో ఆధార్ యొక్క డిజిటల్ కాపీ చాలా అవసరం. ప్రత్యేకించి దీనిని ఫోన్‌లో ప్రతిచోటా తీసుకెళ్లవచ్చు. ఆధార్ యొక్క డిజిటల్ రూపాన్ని ఈ-ఆధార్ అని పిలుస్తారు. ఈ-ఆధార్‌ని UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ నుండి OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) జనరేట్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కాపీ చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం. అయితే, ఇప్పటి వరకు డిజిటల్ కాపీ పొందడానికి కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. కానీ, ఇప్పుడు ఆ సమస్యలేవీ లేకుండా చేసింది UIDAI. కేవలం 10 నిమిషాల్లోనే ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కింది స్టెప్స్‌ని ఫాలో అవడం ఈ-ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

1. అధికారిక UIDAI వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి, https://uidai.gov.in/
2. నా ఆధార్(మై ఆధార్) హోమ్‌పేజీ కింద, ‘ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయి’ ఎంచుకోండి
3. పేజీలో, ‘నమోదు ID’ లేదా ‘వర్చువల్ ID’ ఎంచుకోండి.
4. సబ్మిట్ చేయడానికి ముందు ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయాలనుకునే వారు క్యాప్చా కోడ్‌ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
5. సబ్మిట్ చేశాక మీ నమోదిత ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ OTP ని నమోదు చేయాలి.
6. వివరాలన్నీ నమోదు చేసిన తరువాత మీ ఈ-ఆధార్ కార్డు డిస్‌ప్లే అవుతంది.
7. అయితే, UIDAI ప్రకారం.. ఈ-ఆధార్ కార్డ్‌కు పాస్‌వర్డ్ ఉంటుంది. మీ పేరు, పుట్టిన సంవత్సరం మొదటి నాలుగు అక్షరాలు పాస్‌వర్డ్‌గా ఉంటాయి.

Also read:

Mirror Placement: ఇంట్లో అద్దం సరైన ప్లేస్‌లోనే ఉందా?.. మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..

Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3aJG2o0

Related Posts

0 Response to "Aadhaar Card: ఆధార్ సమస్యలకు చెక్ చెప్పండి.. ఇప్పుడు నిమిషాల్లో ఇ-ఆధార్ పొందండి.. అదెలాగంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel