-->
Andhra Pradesh: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి..

Andhra Pradesh: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి..

Child

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించుకోకపోవడంతో.. ఆమె ఆస్పత్రి బయట రోడ్డుపై ప్రసవించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నప్పటికీ.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకెళితే.. ఏలూరు శివారులోని చిరంజీవి బస్టాండ్ ప్రాంతానికి చెందిన కొంచెం మహాలక్ష్మి నిండు గర్భిణి. నెలలు నిండి ప్రసవ నొప్పులు రావంతో మహాలక్ష్మిని ఆమె కుటుంబ సభ్యులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు.. ఇంకా టైమ్ ఉందంటూ అడ్మిట్ చేసుకోవటానికి నిరాకరించారు. దాంతో మహాలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి బయలుదేరారు. అయితే, దారిలోనే ఆమె ప్రసవించింది. పండంటి మగ బిడ్డ పుట్టాడు. ఆ తరువాత ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా, నిలలు నిండిన గర్భిణిని ఆస్పత్రికి తీసుకువస్తే వైద్య సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదని బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్న వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Huzurabad Bypoll: దళిత బంధు నిలిపివేత.. బీజేపీపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..

Andhra Pradesh: జగనన్న తోడు పథకం.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం జగన్..

Telugu Desam Party: సొంత పార్టీ నేతల ఝలక్ ఇస్తున్న చంద్రబాబు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30MfTU1

Related Posts

0 Response to "Andhra Pradesh: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel