
Ajay Bhupathi: మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాము: అజయ్ భూపతి

Maha Samudram: శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరు హీరోల కథలు రాసుకుని చాలామంది హీరోలను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. ఈ కథని అందరూ ఇష్టపడ్డారు. సోలోగానే హీరోగా చేయాలని అనుకున్న వాళ్లు కూడా ఈ కథ చాలా అద్భుతంగా ఉందని బయట చాలా మందితో చెప్పారు అన్నారు అజయ్. ఆర్ఎక్స్ 100 సినిమా కంటే ముందే శర్వానంద్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కానీ అప్పుడు ఆయనను కలిసే అవకాశం దొరకలేదు. ఇక రావు రమేష్ ద్వారా శర్వాని కలిసే అవకాశం దొరికింది. సిద్దార్థ్ కు శర్వానంద్ కంటే ముందే ఈ కథలు చెప్పి ఒప్పించాను. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న సమయంలోనే కరోనా అడ్డుపడింది. ఇక ఫస్ట్ వేవ్ అనంతరం షూటింగ్స్ మొదలుపెట్టినప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక భావోద్వేగాల ప్రేమ కథ. ఒకరి జీవితాలను మరొకరు జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపించేది అనేది ఇందులోని ప్రధానాంశం అన్నారు అజయ్.
మహా సముద్రంలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది. మన సముద్రంలో హీరో అనేది కథ మాత్రమే. ఇద్దరు హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తావో.. చూస్తాను అని రాంగోపాల్ వర్మ గారు కూడా అన్నారు. సిద్దార్థ్ శర్వానంద్ ఇద్దరు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. వారిద్దరూ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నేను ఏది చెబితే అదే చేశారు. నిర్మాత అనిల్ సుంకర కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. అక్టోబర్ 14న తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చూడబోతోంది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఎవరు మర్చిపోరు. పక్కా ఇది బ్లాక్ బస్టర్ మూవీ. పోస్టర్ కూడా రెడీ చేసుకోండి.. మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాము“ అని అజయ్ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి
Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3v3s4qs
0 Response to "Ajay Bhupathi: మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాము: అజయ్ భూపతి"
Post a Comment