
VC Sajjanar: సజ్జనార్ రూటే సపరేటు.. ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా… తెలిసి అంతా షాక్..

VC Sajjanar traveled RTC bus: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ వీసీ సజ్జనార్ అంటే తెలియని వారుండరు.. ఐపీఎస్ అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా తన మార్క్ తో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న సజ్జనార్.. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీగా సేవలందిస్తున్న సజ్జనార్.. బుధవారం ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్‌కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిపి.. వారి బాధలను సైతం అడిగి తెలుసుకున్నారు. బుధవారం.. ఉదయం 11 గంటల సమయంలో జీడిమెట్ల డిపోకు చెందిన 9ఎక్స్ /272.. గండి మైసమ్మ నుంచి సీబీఎస్ రూట్‌లో వెళ్తున్న బస్సులో సజ్జనార్ లక్డీకాపూల్ వద్ద సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఎక్కారు. కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు.
ఈ సందర్భంగా తోటి ప్రయాణీకులతో మాటలు కలిపి వారి సాధకబాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎంజీబీఎస్ కు వెళ్లిన అనంతరం అక్కడ కూడా సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను పరిశీలించారు. ఏఏ ప్లాట్‌ఫాంలల్లో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్‌వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును ఆయన క్షణ్ణంగా పరిశీలించారు. అలాగే బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా పరిశీలించారు. అంతేకాకుండా ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, పరిసరాలను శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని, పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయిన వాహనాలను తక్షణమే స్క్రాప్ యార్డ్‌కు తరలించాలని సూచించారు. అలాగే ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్ సోరింగ్ ఏజెంట్స్‌కు అప్పగించాలని సూచించారు. ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను వెంటనే భర్తీకి చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు.

Vc Sajjanar Traveled Bus
ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పండుగలు, వివాహ సమయాలలో బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని సూచించారు. రాబోయే దసరా పండుగ నేపథ్యంలో తగిన బస్సులను నడిపి సంస్థ ఆదాయాన్ని పెంచాలని.. ఇప్పటినుంచే రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. దీనికోసం ప్రచారం కూడా నిర్వహించాలని ఆదేశించారు.
Also Read:
Mirchi Bajji: వ్యక్తి ప్రాణాలు తీసిన మిర్చి బజ్జీ.. తింటుండగా.. గొంతులో ఇరుక్కుని..
Sansad TV: సంసద్ టీవీని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇకపై రెండు ఛానెళ్లు కలిపి ఒకటిగా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zfN4KQ
0 Response to "VC Sajjanar: సజ్జనార్ రూటే సపరేటు.. ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా… తెలిసి అంతా షాక్.."
Post a Comment