
Urine Colour: మూత్రం రంగులో మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే మీరు వ్యాధుల బారిన పడుతున్నట్లే. అవేంటో తెలుసుకోండి..

Urine Colour: సాధారణంగా మనం ఏదైనా అనారోగ్యం బారిన పడితే వైద్యులు ముందుగా మందులు రాసిస్తారు. వ్యాధి ఎంతకూ తగ్గకపోతే యూరిన్ టెస్ట్ రాసిస్తారు. దీనర్థం మూత్ర పరీక్ష ద్వారా శరీరంలో ఉన్న వ్యాధిని సులభంగా గుర్తించవచ్చని. అయితే కొన్నిసార్లు మూత్ర విసర్జన చేసే సమయంలో రంగు మారడాన్ని గమనిస్తుంటాయి. ఇది దేనికైనా ఇండికేషనా.? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు.
మనం విసర్జించే మూత్రం రంగును బట్టి మనకు ఏయో ఆరోగ్యం సమస్యలు వచ్చాయో.? రావడానికి సిద్ధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముదురు గోధుమ రంగు..
మూత్ర విసర్జన ముదురు గోధుమ రంగులో ఉంటే పచ్చ కామెర్లు అయి ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా లివర్, మూత్రాశయం, క్లోమ గ్రంథి సమస్యలు ఉన్నా మూత్రం ఇదే రంగులో కనిపిస్తుంది. కాబట్టి మూత్రం రంగు ఇలా గోధుమ రంగులోకి మారిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
ఎరుపు రంగులో వస్తే..
ఒక వేళ మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే తీవ్ర అనారోగ్య సమస్య ఉందని గుర్తించాలి. ముఖ్యంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో ట్యూమర్లు ఏర్పడిన సమయంలో మూత్రం ఎర్రగా వస్తుంది. కాబట్టి ఇలా రంగు మారినట్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి వైద్యులను సంప్రదించాలి.
దుర్వాసన ఎక్కువగా వస్తుంటే..
కొన్ని సందర్భాల్లో మూత్ర విసర్జన చేసిన సమయంలో దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే ఇలా వస్తుంది. కాబట్టి మూత్రం డార్క్ కలర్‌లో దుర్వాసనతో వస్తే వైద్యుల సలహాతీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో తీసుకునే ఆహారంలో కారం, మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎక్కువగా ఉన్నా సరిపడ నీటిని తీసుకోకపోయినా ఈ సమస్య వస్తుంది.
ఇక కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో సంబంధం లేకుండా కూడా మూత్రం రంగులో మార్పులు కనిపిస్తుంటాయి. కీమోథెరపీ మందులను వాడుతుంటే మూత్రం నారింజ రంగులో వస్తుంది. క్యారెట్లను అధికంగా తింటే మూత్రం లైట్ ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. విటమిన్ సి ని అధికంగా తీసుకున్నా కూడా మూత్రం ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. ఇక బి విటమిన్లు ఎక్కువైతే మూత్రం గ్రీన్ కలర్‌లో వస్తుంది. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే ఫర్వాలేదు కానీ.. తరచూ రిపీట్ అయితే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి.
Also Read: ఈ 5 సుగంధ ద్రవ్యాలతో సులువుగా బరువు తగ్గవచ్చు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Atnq72
0 Response to "Urine Colour: మూత్రం రంగులో మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే మీరు వ్యాధుల బారిన పడుతున్నట్లే. అవేంటో తెలుసుకోండి.."
Post a Comment