
Shruti Hassan: ‘ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా’.? నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి సమాధానం ఏంటో తెలుసా?

Shruti Hassan: తండ్రి నటన వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతీ హాసన్. కేవలం తన ట్యాలెంట్‌నే నమ్ముకున్న ఈ అమ్మడు దాంతోనే కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సింగింగ్‌తో తాను మల్టీ ట్యాలెంట్ అని చాటి చెప్పిందీ చిన్నది. ఇక ముక్కుసూటి తనానికి పెట్టింది పేరైన శృతి తన భావాలను ఎలాంటి సంశయం లేకుండా చెప్పేస్తుంది. కేవలం సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం ద్వారా కూడా ఈ అమ్మడు ఎప్పుడు లైట్‌లైట్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ అమ్మడుకి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు భలే సమాధానం ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఓ అభిమానికి శృతీ హాసన్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈ ప్రేమాయణాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా.?’ అని కాస్త వ్యంగ్యంగా ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తుకుపోయిన ఈ అమ్మడు ఘాటూగా స్పందించింది. ఈ ప్రశ్నకు శృతీ స్పందిస్తూ.. ‘వివాహం అనేది పూర్తిగా నా వ్యక్తిగత వ్యవహారం, దాని గురించి ఊహాగానాలు చేసుకుంటూ మనసు పాడు చేసుకోవద్దు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం చేయడం మంచి లక్షణం కాదు’ అంటూ తనదైన శైలిలో స్పందించిందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఈ అమ్మడు తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘సలార్’ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయం తెలిసిందే. మరి ఈ సినిమా ఫలితం శృతీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Krithi Shetty Photos: క్యూట్ ఫోజులతో తన అభిమానుల మనసులను దోచుకుంటున్న కృతి.. బెబమ్మ న్యూ ఫొటోస్..
Rashi Khanna Photos: కవ్వించే చూపులతో మనసు దోచుకుంటున్న బొద్దు ముద్దుగుమ్మ రాశి ఖన్నా.. ఫొటోస్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CsAVo7
0 Response to "Shruti Hassan: ‘ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా’.? నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి సమాధానం ఏంటో తెలుసా?"
Post a Comment