
Turmeric Prosperity: పసుపును ఇలా వినియోగిస్తే ఆరోగ్యమే కాదు.. ఐశ్యర్యమూ సిద్ధిస్తుంది.. అదెలాగో ఇక్కడ చూడండి..

Turmeric Prosperity: సనాతన సంప్రదాయంలో పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతీ శుభకార్యంలోనూ పసుపును వినియోగిస్తారు. జ్యోతిష్యం, ఆయుర్వేద పరంగా పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. కాలానుగుణమైన అన్ని అడ్డంకుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీ అదృష్టాన్ని పెంచుతుంది. వాస్తవానికి పసుపు బృహస్పతికి సంబంధించినది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకునే వారు పూజ మొదలు.. ఆహారం, తాగే నీటిలోనూ పసుపును వినియోగించాల్సిన అవసరం ఉంది. మీ జాతకంలో బృహస్పతికి సంబంధించి బలహీనతగా ఉంటే.. పసుపు వినియోగం ఎంతో ఉపయోగకరం అని చెప్పాలి. అసలు పసుపు వల్ల మనుషులకు జరిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
1.దేవగురువు బృహస్పతి ఆశీస్సులు పొందడానికి మీరు పూజలో పసుపును ఉపయోగించాలి. నుదిటిపై తిలకం రూపంలో ధరించాలి. ప్రసాదం రూపంలో చిటికెడు పసుపును ఆరగించాలి.
2. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ప్రతీ గురువారం పసుపు నీటిని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా, ఆ మహా విష్ణువు ఆశీర్వాదాలతో పాటు.. లక్ష్మీ దేవి కూడా కటాక్షిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
3. మీ వివాహంలో జాప్యం జరిగినా.. పెళ్లి విషయం మరింత దిగజారిపోతున్నా.. ప్రత్యేకించి గురువారం నాడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయాలి.
5. మీరు కెరీర్, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందలేకపోతే, నిరంతర అడ్డంకులు ఉన్నట్లయితే మీరు దేవగురు బృహస్పతి మంత్రాలతో పూజించిన పసుపు దండను ధరించాలి.
Baca Juga
Also read:
Numerology: మీ జీవిత భాగస్వామి స్వభావం, లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇది చూడండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3n1xosf
0 Response to "Turmeric Prosperity: పసుపును ఇలా వినియోగిస్తే ఆరోగ్యమే కాదు.. ఐశ్యర్యమూ సిద్ధిస్తుంది.. అదెలాగో ఇక్కడ చూడండి.."
Post a Comment