-->
Telangana: ఈ మహాయజ్ఞంలో సంపూర్ణ భాగస్వాములవ్వండి.. ఉపాధ్యాయులను కోరిన సీఎం కేసీఆర్..

Telangana: ఈ మహాయజ్ఞంలో సంపూర్ణ భాగస్వాములవ్వండి.. ఉపాధ్యాయులను కోరిన సీఎం కేసీఆర్..

Cm Kcr

Telangana: భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5న జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే శిల్పుల వలె గురుతర బాధ్యతను నిర్వహించే గురువుల సేవలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో గురువులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యధికంగా గురుకులాలు నెలకొల్పి, విద్యా వ్యవస్థను దేశంలోనే పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తెలంగాణ విద్యను దేశానికి తలమానికంగా రూపుదిద్దే మహాయజ్ఞంలో సంపూర్ణ భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విద్యాలయాలు పునః ప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, విద్యనందించాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు.

Also read:

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ఈరోజు సిల్వర్ ఎంత పెరిగాయంటే…

Astrology : గోర్లపై ఉండే రంగు, ఆకారం మీ భవిష్యత్‌ను చెప్పగలవు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

CRPF Jawan Dead: భద్రాచలం సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర విషాదం.. వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో జవాన్ మృతి



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/38WdpmR

0 Response to "Telangana: ఈ మహాయజ్ఞంలో సంపూర్ణ భాగస్వాములవ్వండి.. ఉపాధ్యాయులను కోరిన సీఎం కేసీఆర్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel