-->
Telangana Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 3వ రోజు ఎజెండా.. చర్చాంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవీ..

Telangana Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 3వ రోజు ఎజెండా.. చర్చాంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవీ..

Telangana Assembly

Telangana Assembly Monsoon Sessions: తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల చర్చనూ చేపట్టనున్నారు. ఇక నేడు మూడవరోజు ఉభయ సభల సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలు ఇలా ఉన్నాయి:

# సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం

# GSDPలో పెరుగుదల

# కస్తూర్బా బాలికా విద్యాలయాలు

# గ్రామ పంచాయతీలో నిధుల మళ్లింపు

# పంచాయతీరాజ్ రోడ్లపై కల్వర్టుల మరమ్మతులు

# రైతుల నుంచి పత్తి సేకరణ

ఇక, శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నలు.. ఇవీ:

# రామప్ప ఆలయం వద్ద పర్యాటక ప్రోత్సాహకం

# హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై సౌకర్యాలు

# ఆహార శుద్ధి కేంద్రాలు

# సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం

# సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సొంత భవనాలు

# నిరుద్యోగ యువత కొరకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు

కాగా, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత శాసనమండలిలో తెలంగాణలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.  శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత హరితహారం పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

ఆరు బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు.. ఆ బిల్లుల వివరాలివి:

1) తెలంగాణ gst సవరణ బిల్లు 2021 ను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు.

2) ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెడతారు.

3) తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు2021ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.

4) కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లును నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

5) ది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.

6) తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టనున్నారు.

Read also: Huzurabad: హుజురాబాద్ అభ్యర్థికి బీ ఫారంతోపాటు, ఎన్నికల ఖర్చుకు టీఆర్ఎస్ పార్టీ ఎంతిచ్చిందో తెలుసా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3A27Z4C

0 Response to "Telangana Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 3వ రోజు ఎజెండా.. చర్చాంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel