
Assistant Professor: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పీహెచ్‌డీ అవసరం లేదు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు లైన్‌క్లియర్..

Assistant Professor Posts – Dharmendra Pradhan: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రమాణాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పీడీఎఫ్, పీహెచ్‌డీ తప్పనిసరి కాదంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ) లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణయం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందంటూ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో.. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు నేషనల్ ఎలిజిబులిటి టెస్ట్‌తో పాటు పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం, యూజీసీ 2018లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం దేశంలోని యూనివర్సిటీల్లో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడం, ఆ స్థాయిలో అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో.. ఈ నిర్ణయంపై విద్యాశాఖ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతానికి 2018లో జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Also Read:
AP Polycet 2021: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. తరగతులు ఎప్పటి నుంచంటే..
Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన షార్ట్ సర్వీస్ కమిషన్..ఎలా అప్లై చేయాలంటే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zSFCWF
0 Response to "Assistant Professor: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పీహెచ్‌డీ అవసరం లేదు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు లైన్‌క్లియర్.."
Post a Comment