-->
MS Dhoni: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

MS Dhoni: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

Ms Dhoni

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ వికెట్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోని అరుదైన ఘనత సాధించాడు. మధ్యలో ఒక సీజన్‌ మినహా ఆరంభం నుంచి సీఎస్‌కే తరఫున ఆడుతున్న ధోని వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ధోని తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో రైనా 98 క్యాచ్‌లతో రెండో స్థానంలో, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా ధోని ఐపీఎల్‌లో వికెట్‌ కీపర్‌గా 215 మ్యాచ్‌ల్లో 119 క్యాచ్‌లు, 39 స్టంప్స్‌తో మొత్తం 158 డిస్‌మిసిల్స్‌ ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ద్వారా ధోని మరో రికార్డును కూడా అందుకున్నాడు. ధోని వికెట్‌ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురి కంటే ఎక్కువ బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌లు తీసుకోవడం ఇది పదోసారి.

ధోని తర్వాత ఏబీ డివిలియర్స్‌ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్‌ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో ఉన్నాడు. దీనికి తోడు ఎంఎస్‌ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్‌కే ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై కెప్టెన్ అత్యంత విలువైన ఆటగాడు అంటూ కామెంట్ చేశారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ సీఎస్‌కే తరఫున ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలోనే మహీ సారథ్యంలో చెన్నై జట్టు ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. మరోసారి టైటిల్ దిశగా అడుగులేస్తోంది. ఈ 14 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.18 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

Also Read:విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!

ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ.. సంతాపాన్ని వ్యక్తం చేసిన సినీప్రముఖులు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3onYaMk

Related Posts

0 Response to "MS Dhoni: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel