-->
Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో..

Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో..

Mahesh

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారు పాట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే గోవా షెడ్యూల్‌‌‌ను పూర్తి చేసుకున్న సర్కారు వారి టీమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా అయిపోయిందని తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌తోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందట. అలాగే తండ్రికొడులు మధ్య ఎమోషన్‌ను ఈ సినిమాలో చూపించనున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి షూటింగ్ స్పాట్‌లో అనుకోని అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ఎంపీ శశి థరూర్ ప్రత్యక్షమయ్యారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌తోపాటు తెలుగుదేశం ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ కూడా ‘సర్కారు వారి పాట’ లొకేషన్‌లో మహేష్ బాబును కలిశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని శశిథరూర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘సూపర్ స్టార్ మహేష్ బాబుని హైదరాబాద్‌లో కలిశాను. నాతో పాటుగా  జయదేవ్ గల్లా కూడా ఉన్నారు. మహేష్ ది ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం” అని శశిథరూర్ అన్నారు. అలాగే ”మహేష్ బాబుతో మాట్లాడితే “సూపర్ స్టార్” ట్యాగ్ లేకుండా హైదరాబాద్‌లో ఎవరూ ఆయనను ఎందుకు పిలవరో మీకు అర్ధమవుతుంది. మేము మాట్లాడుకున్న తర్వాత అతను తన సినిమాలో విలన్‌లతో ఫైట్ చేశాడు” అని థరూర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ మీటింగ్‌కు సంబందించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: ఇదేం రచ్ఛరా నాయన.. మరీ ఆలూ కర్రీ కోసం ఇంత సీన్ అవసరమా..? ఓ రేంజ్‌లో ఆ ఇద్దరి గొడవ

Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Vpn1Dc

Related Posts

0 Response to "Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel