
Mahesh Babu: సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించిన సూపర్ స్టార్.. ఎఫ్‌బీలో మహేష్ ఫాలోవర్లు ఎంతో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్‌లో మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో ఇండస్ట్రీ హిట్‌లను సొంతం చేసుకుంటూ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు మహేష్. తనదైన అందం, నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిదిలాంటిది కాదు. సోషల్ మీడియాలోనూ మహేష్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. మహేష్ ఓ చిన్న పోస్ట్ చేస్తే చాలు లైక్‌లు, షేర్‌లతో సోషల్ మీడియా హోరెత్తుతుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పటికే పలు అరుదైన రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. ఫేస్‌బుక్‌లో మహేష్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య తాజాగా 15 మిలియన్లు దాటింది. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో మహేష్ ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Superstar #MaheshBabu reaches a new milestone of 15M followers on Facebook.#15MForSuperstarMaheshFB pic.twitter.com/GnoYYji7kd
— Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2021
RGV Comments: మూఢ నమ్మకాలు, భ్రమల గురించి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan Birthday: ఒక రోజు ముందే సర్‌ప్రైజ్ చేసిన భీమ్లా నాయక్ టీమ్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kGHFHE
0 Response to "Mahesh Babu: సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించిన సూపర్ స్టార్.. ఎఫ్‌బీలో మహేష్ ఫాలోవర్లు ఎంతో తెలుసా?"
Post a Comment