-->
Lockdown Effect: డయాబెటిస్‌ ముప్పును పెంచిన లాక్‌డౌన్‌.. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తల వెల్లడి

Lockdown Effect: డయాబెటిస్‌ ముప్పును పెంచిన లాక్‌డౌన్‌.. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తల వెల్లడి

Diabetes

Lockdown Effect: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి వల్ల తలెత్తుతున్న ఇబ్బందులు అన్నీ.. ఇన్ని కావు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉండటంతో అధిక బరువు పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పాటు డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది బరువు పెరిగారని, ఈ కారణంగా వారికి టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు ఎక్కువైందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీలో ప్రచురితం అయ్యాయి. బ్రిటన్‌లో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) చేపట్టిన మధుమేహ నివారణ కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో భాగంగా 40 ఏళ్లలోపు వారి డేటాపై అధ్యయనం కొనసాగించారు. మూడు సంవత్సరాలకు ముందు ఈ కార్యక్రమంలో చేరిన వారితో పోలిస్తే తాజాగా ఇందులో పాలుపంచుకున్న వారి బరువు సరాసరిన 3.6 కిలోల మేర పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీర బరువు కిలో మేర పెరిగినా డయాబెటిస్‌ ముప్పు 8 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అధిక బరువుతో ఇతర వ్యాధులు..

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికంగా బరువు పెరిగారు. దీని వల్ల టైప్‌-2 డయాబెటిసే కాకుండా దానితో ముడిపడిన క్యాన్సర్‌, అంధత్వం, గుండెపోటు, పక్షవాతం తదితర వ్యాధుల నుంచి ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఎస్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ వాలాబ్జి తెలిపారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మన జీవన విధానంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చని తెలిపారు. అయితే టైప్‌-2 డయాబెటిస్‌ పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి వయసు, కుటుంబ ఆరోగ్య నేపథ్యం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. వీటితో పోలిస్తే ఊబకాయం అతిపెద్ద ముప్పు. ఇది 80-85 శాతం మేర మధుమేహానికి చేరువ కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇవీ కూడా చదవండి:

Kidney Problem: కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

Healthy Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటివి తీసుకోకూడదు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/38PAWp7

0 Response to "Lockdown Effect: డయాబెటిస్‌ ముప్పును పెంచిన లాక్‌డౌన్‌.. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తల వెల్లడి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel