-->
Hyderabad: ప్రియుడితో భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్

Hyderabad: ప్రియుడితో భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్

Kidnap

ఇది మాములు వ్యవహారం కాదు. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. యస్.. ప్రియుడితో ప్రయాణం షురూ చేసేందుకు భర్తను కిడ్నాప్ చేయించింది ఓ వివాహిత. అనంతరం బలవంతంగా విడాకులు తీసుకుంది. ఎట్టకేలకు బాధితుడిని సేవ్ చేసిన పోలీసులు.. సదరు మహిళతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్‌ (31), ఆప్షియా బేగం(24)లకు 2012లో పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం. వాజీద్‌ బస్టాండ్‌ ఏరియాలోని చెప్పుల షాపులో సేల్స్‌మెన్‌‌గా వర్క్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే చురుగ్గా ఉండే ఆప్షియాబేగంకు ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్‌ పనులు చేసే ఆసిఫ్‌ పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆ బంధం చాలా దూరం వెళ్లింది. ఆసిఫ్‌‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏం మాయమాటలు చెప్పాడో ఏమో తెలియదు కానీ.. ఆప్షియా బేగం గత ఏప్రిల్‌లో ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె భర్త మల్కాజిగిరి పీఎస్‌లో కంప్లైంట్ చేయగా పోలీసులు ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు. అయినా మరోసారి పిల్లలతో కలిసి ప్రియుడి వద్దకే వెళ్లిపోవడంతో అత్తామామల సహాయంతో తిరిగి తీసుకొచ్చాడు. భర్తతో ఉండటం ఇష్టం లేదని.. విడాకుల కావాలని ఆమె మొండికేసింది. అందుకు అతడు ససేమేరా అన్నాడు. ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆప్షియా బేగం అతడితో కలిసి కిడ్నాప్‌ స్కెచ్ వేసింది. దీంతో ఆసిఫ్‌ ముషీరాబాద్‌, పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్‌ మహ్మద్‌(31), ఎండి జాఫర్‌(33), ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌లను ఇందుకు రెడీ చేశాడు

వీరు నలుగురు రెండు బైక్‌లపై సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో వాజీద్‌ పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి అతడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ముషీరాబాద్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అప్పటికే వారు సిద్ధం చేసుకుని ఉంచిన మతపెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించుకున్నారు. వాజీద్‌ కిడ్నాప్‌ విషయాన్ని అదేరోజు రాత్రి షాపు ఓనర్స్ మార్కెట్‌ పోలీసులకు తెలియజేశారు. బాధితుడి ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా వాజీద్‌ను కాపాడారు. ఆప్షియాబేగంతోపాటు కిడ్నాప్‌నకు పాల్పడిన ఇమ్రాన్‌ అహ్మద్‌, జాఫర్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఆసిఫ్‌తోపాటు ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌ల కోసం గాలిస్తున్నారు.

Also Read: రెండున్నరేళ్ల ఏపీ ప్రగతి ఇదే.. జగన్‌ సర్కార్‌పై పవన్‌ కల్యాణ్ ఘాటు విమర్శలు..

అరకు ఘాట్ రోడ్ లో ఏరులై పారుతోన్న వరదనీరు.. విశాఖ ఏజెన్సీలో విరిగిపడుతున్న కొండచరియలు

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CZMmE5

Related Posts

0 Response to "Hyderabad: ప్రియుడితో భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel