-->
Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే..

Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే..

Anchor Ravi

బిగ్‏బాస్ సీజన్ 5.. నామినేషన్ ప్రక్రియ హీట్‏గా కొనసాగిన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ.. ఎమోషనల్ డ్రామా నడిపించారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో మాత్రం కాస్త ఫన్నీగానే గడిచిందనుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా యాంకర్ రవి పరిస్థితి దారుణంగా మారిందనే అనుకోవాలి. కెమెరాలున్నాయని మార్చిపోయాడో.. మరి పొరపాటులో వాగేసాడో తెలీదు కానీ.. లహరి గురించి ప్రియ దగ్గర దారుణంగా మాట్లాడడం… ఆ తర్వాత నేను మాట్లాడలేదు అని బుకాయించడం.. నాగార్జున వచ్చి అడ్డంగా ఇరికించడంతో.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు రవి. తప్పైంది క్షమించండి అంటూ ప్రియ, లహరిలకు, తన తల్లికి చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్పాడు. ఇదే కాకుండా.. రవి పరిస్థితి ఇప్పటికీ దారుణంగానే ఉందనుకోవాలి. మరోసారి ఇంటిసభ్యులు తనను చులకనగా చూస్తున్నారని బాధపడుతుండగా.. నామినేషన్ ప్రక్రియ తర్వాత కాజల్ కూడా దూరం పెడుతూ వస్తుంది. నిన్నటి (సెప్టెంబర్ 29)న ఏం జరిగిందో తెలుసుకుందాం.

నిన్నటి ఎపిసోడ్‏లో యాంకర్ రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి గుంటనక్క నేనే కదా.. అని అడిగారు. దీంతో మాస్టర్ నేరుగా అసలు విషయం మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా… గుంటనక్క అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అంటూ కౌంటర్ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. ఆ తర్వాత పికాక్ ఎగిరిపోయిందని.. లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశాడు. సరే కానీ గుంటనక్క ఎవరో చెప్పండి అంటూ వెంటపడ్డాడు రవి.. దీంతో నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. నువ్వు ఎవర్నీ ‏ప్రభావితం చేయకు.. నాకు ఆ పాయింట్‏లో అలా అనిపించింది అంతే.. నువ్ ఫీల్ కాకు అని సలహా ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. ఒక్కసారి నువ్ గుంటనక్క కాదని చెప్పండి మాస్టర్.. ప్రతి వారం నాగార్జున సర్ వచ్చి గుంటనక్క ఎవరు అడగ్గానే.. అందరూ నా వైపే చూస్తున్నారు. నాకు ఎట్లుంటుంది అన్నా అంటూ ఫీల్ అయ్యాడు రవి. నా మాట నేను ఎప్పుడో మార్చిపోయానని.. కానీ ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి కరెక్ట్ పేరు పెట్టావు అని చెప్పాడు అంటూ విశ్వను ఉద్దేశించి అన్నాడు. దీంతో రవి.. అనుమానంగా విశ్వనా అని అడిగాడు. ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట కదా అని ప్రశ్నించాడు. దీంతో నేను అనలేదని.. కెమెరాలు కూడా చూస్తున్నాయని.. ఆ మాట అనలేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రవి పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనుకోవాలి. ఇతరుల గురించి మరో కంటెస్టెంట్ దగ్గర మాట్లాడిన మాటలు తనకే ఉచ్చుగా మారుతున్నాయి.

Also Read: Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Nivetha Pethuraj: క్యూట్‌నెస్ ఓవర్ లోడ్.. కవ్విస్తున్న నివేద పేత్‌రాజ్ లేటెస్ట్ ఫొటోస్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EYPRfD

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel