-->
Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

Linkedin

Hiring Trends: కరోనా మహమ్మారి ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించుకున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు అయితే భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల జీతాలను తగ్గించాయి. దాదాపు రెండేళ్లు కరోనా ప్రభావం నేపథ్యంలో కొత్త ఉద్యోగులను సైతం తీసుకోవడానికి కంపెనీలు వెనుకడుగు వేశాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీంతో కంపెనీలు మళ్లీ ఉద్యోగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ సంస్థ లింక్ట్‌ఇన్‌ తాజా సర్వేలోనూ ఇదే విషయాలు వెల్లడయ్యాయి.

కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడంలో రికవరీ కనిపిస్తోంది లింక్డ్‌ఇన్‌ ఇండియా తెలిపింది. కరోనా ప్రభావానికి ముందు అంటే 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా ఉద్యోగాల నియామకాలు జరిగాయని తెలిపింది. ఇక 2021 ఏప్రిలో ఉద్యోగాల నియమాకాల్లో నెమ్మది కనిపించగా ఆ తర్వా నుంచి రికవరీ ప్రారంభమైందని కంపెనీ తేలింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్‌ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు పెరిగాయి.

ముఖ్యంగా ఏడాది తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్‌ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. రానున్న రోజుల్లోనూ ఉద్యోగాల నియామకాలు పెరగనున్నాయని సర్వేలో తేలింది. ఇక కొత్త ఉద్యోగాల కంటే పాత జాబ్‌ మారుతున్న వారే అధికంగా ఉన్నారని తేలింది.

Also Read: Used Cooking Oil: ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలకే పెను ముప్పు..!

Kcr-Modi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 50 నిమిషాల ఈ భేటీలో దేని గురించి చర్చించారంటే..

SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zNITY6

0 Response to "Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel