-->
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Gold

Gold Price Today: పసిడి కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌. ధరలు దిగి వస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా శుక్రవారం దిగి వచ్చింది. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్తే. దేశంలో బంగారం ధరల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గితే.. మరి కొన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశీయంగా శుక్రవారం (అక్టోబర్‌1) 10 గ్రాముల బంగారం ధరపై రూ.600ల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

► ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,930 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.46,960 ఉంది.

ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి..?

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

New Car: పండగ సీజన్‌ వచ్చేస్తోంది.. కారు కొనాలనుకుంటున్నారా..? కాస్త వీటిని కూడా పట్టించుకోవాలి.. అవేంటంటే..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F8VzMc

Related Posts

0 Response to "Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel