-->
CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!

CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!

Co Win App

CoWin Certificates: కరోనా మహమ్మారి వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చాలా సమస్యలు మొదలయ్యాయి. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోకపోగా, మరికొంత మంది వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. విదేశాలకు వెళ్లాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ టీకాలు వేయించుకోవటం తప్పనిసరి. అలాగే ఆ సర్టిఫికెట్‌ను కూడా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రయాణానికి అనుమతి ఉండదు. తాజాగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కోవిన్ యాప్ గుడ్ న్యూస్ చెప్పింది. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు నుంచి సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వరకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మన పూర్తి వివరాలు కోవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తారు. కోవిడ్‌ టీకాలు తీసుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ జారీ చేయబడుతుంది.

యాప్‌లో కొత్త ఫీచర్‌..

ఈ మేరకు కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తూ విదేశీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిన్ యాప్‌లో సర్టిఫికెట్‌ను పొందుతారన్న విషయం తెలిసిందే. అయితే ఈ కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీని కూడా యాడ్ చేసింది.

కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో ఇంటి పేరుతో సహా పేరు, పుట్టిన తేదీ, దేశం లేదా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతం, వ్యాక్సిన్ జారీ చేసిన ప్రాంతం గురించి వివరాలు అన్ని ఉండాలి. లేదంటే విదేశీ ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. కోవిన్ ప్రస్తుతం జారీ చేస్తున్న సర్టిఫికెట్‌లో లబ్దిదారుని పేరు, వయసు, లింగం, ప్రత్యేక ఆరోగ్య ఐడి, ఐడి, వ్యాక్సిన్ పేరు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, వ్యాక్సిన్ వేయించుకున్న తేదీ, ఇమ్యునైజేషన్ పేరు, వ్యాక్సిన్ కేంద్రం, పుట్టిన సంవత్సరం, రాష్ట్రం వంటి వివరాలను చూపిస్తుంది. ఇక నుంచి పుట్టిన తేదీని వివరాలు కూడా ఉంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌లో పుట్టిన తేదీ ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఛైర్మన్  ఆర్ ఎస్ శర్మ ఈ కోవిడ్‌ యాప్‌లో అప్‌డేట్‌ చేసిన మార్పులను ట్వీట్టర్‌ ద్వారా పంచుకున్నారు. కోవిన్‌ యాప్‌ నుంచి సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కొత్త వెర్షన్‌ను తీసుకువచ్చాము. విదేశాలకు వెళ్లేవారు కొత్త వెర్షన్‌ నుంచి సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. ఇందులో పుట్టిన తేదీ ఫీచర్‌ను తీసుకురావడం వల్ల విదేశాలకు ప్రయాణం చేసే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

India Covid-19: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?

Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం వెళితే.. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F3NzvQ

Related Posts

0 Response to "CoWin Certificates: విదేశాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. కోవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. అదేంటంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel