
Finance Tasks: సెప్టెంబర్‌లో తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే.. లేకపోతే ఇబ్బందులే..!

Finance Tasks: కొన్ని ఆర్థిక విషయాలకు సంబంధించిన పనులను గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో గడువులు పూర్తయిపోయాయి. పలు ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్ను తదితర వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం ఎన్నో గడువులు విధించింది. కొన్ని పనులు పూర్తి చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు ఉండగా, సెప్టెంబర్ నెల మొత్తం పొడిగించింది. మరి ఈనెలలో పూర్తి చేయాల్సిన పనులు ఏమిటో చూద్దాం.
ఆధార్-పాన్ లింక్ గడువు:
ఆధార్-పాన్ కార్డును అనుసంధానించేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు పనిచేయవు. బ్యాంక్ ఖాతా తెరవడంతో పాటు ఇతర ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పాన్ కార్డ్ తప్పనిసరి.
ఐటీఆర్ ఫైలింగ్:
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది జూలై 31లోపు రిటర్నుల దాఖలు పూర్తిచేయాలి. అయితే ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 30 వరకు గడువు పొడిగించారు. అందువల్ల ఇప్పటి వరకు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవడం బెటర్. లేదంటే రూ.5వేల ఆలస్య రుసుముతో పన్ను దాఖలు చేయాల్సి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే ఆలస్య రుసుము రూ.1000కి మించదు.
ఆధార్-పీఎఫ్ లింక్ తప్పనిసరి:
సెప్టెంబర్ నుంచి యజమానులు వారి కాంట్రీబ్యూషన్‌ను ఉద్యోగుల ఖాతకు క్రెడిట్ చేయాలంటే ఆధార్‌ను యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబరు)కు తప్పనిసరిగా అనుసంధానించాలి. ఇందుకోసం ఈపీఎఫ్ సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142ను కేంద్రం సవరించింది. ఇతర సేవలు, ప్రయోజనాలు, చెల్లింపులు స్వీకరించేందుకు ఆధార్-యూఏఎన్ లింక్ తప్పనిసరి చేసింది.
ఆటో డెబిట్ లావాదేవీలు:
బ్యాంక్ ఖాతా నుంచి చేసే ఆటో డెబిట్ చెల్లింపులకు వచ్చే నెల ప్రారంభం నుంచి అంటే అక్టోబరు 1 నుంచి టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అవసరం. ఇందుకోసం బ్యాంక్ రికార్డుల్లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం ఎంతో ముఖ్యం. సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సిప్‌లకు ఇచ్చే ఆటో-డెబిట్ ఆదేశాలకు తప్పనిసరి అవుతుంది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు, రుణాల చెల్లింపులతో పాటు ఇతర సేవలకు సంబంధించి నెలవారీ చేసే లావాదేవీల్లో ఆటో-డెబిట్ ఆప్షన్‌ను వినియోగిస్తారు. ఆటో-డెబిట్ చేసే ఐదు రోజుల ముందుగానీ లేదా కనీసం 24 గంటలు ముందుగానీ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్ పంపాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయితే ఆటో డెబిట్ పూర్తవుతుంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను సురక్షితం చేసేందుకు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచే ఈ పద్ధతిని తీసుకురావాలని అనుకున్నప్పటికీ.. కస్టమర్ల సౌకర్యార్థం సెప్టెంబరు 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
డీమ్యాట్-ఖాతా కేవైసీ:
డ్యీమాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30 లోపు కేవైసీ (నో-యుర్-కస్టమర్) పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్‌డీ-యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇవీ కూడా చదవండి!
Insurance Policy: మీకు మద్యం తాగే అలవాటు ఉండి బీమా పాలసీ తీసుకుంటున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి
Low CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BZcvCz
0 Response to "Finance Tasks: సెప్టెంబర్‌లో తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే.. లేకపోతే ఇబ్బందులే..!"
Post a Comment