
Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)

ఒక కథకో, కధనానికో, సినిమాకో ఇలా కొన్నింటికి కాపీరైట్స్ ఉండటం సహజం. కానీ లైట్లకు కూడా కాపీ రైట్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అయితే తెలుసుకోండి. దీనికోసం మనం ప్యారిస్ వెళ్దాం.. ఈఫిల్ టవర్ తెలుసుకదా.. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఈ టవర్‌ను చూడ్డానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు వస్తారు. అయితే ఈఫిల్ టవర్‌ను చూసేందుకు చాలావరకు సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే.. సాయంత్రం టవర్ మొత్తం విద్యుత్ లైట్ల వెలుగుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే ప్యారిస్‌ను సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు.
అయితే రాత్రి వేల ఈఫిల్ టవర్ చూడ్డానికి వెళ్తే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో గొప్పగా చెప్పుకోవచ్చు కదా అని రాత్రి వేళ ఫోటో తీశారో ఇక మీ పని అంతే. ఎందుకంటే రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫొటోలు తియ్యకూడదు. యూరోపియన్ కాపీరైట్ లా ప్రకార౦.. ఆ లైట్లకు కాపీరైట్స్ ఉన్నాయి. యూరోపియన్ కాపీరైట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫొటోతీసి సోషల్ మీడియాలో గనుక షేర్ చేస్తే సమస్యల్లో పడతారు. లైటింగ్‌తో ఉన్న ఈఫిల్ టవర్ ఫొటోలు, వీడియోల హక్కులన్నీ దాన్ని నిర్మించిన వారికే ఉన్నాయి. ఈఫిల్ టవర్ వంటి స్మారక చిహ్నాలపై కాపీరైట్ అనేది 70 ఏళ్లకు పైగా ఉంటుందట.
ఈఫిల్ టవర్ నిర్మించిన గుస్తావ్ ఈఫిల్ 1923లో మరణించాడు. కాబట్టి 1993లో ఈఫిల్ టవర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అందుకే పగటి పుట తీసుకునే ఫోటోలపై ఎటువంటి కాపీరైట్ చర్యలు తీసుకోరు. కానీ, ఈఫిల్ టవర్ నైట్ లైటింగ్స్‌ని 1985లో ఏర్పాటు చేశారు. అందువల్ల వాటికి ఫ్రాన్స్‌లోని కాపీ రైట్ చట్టం ప్రకారం దానిమీద ఆర్టిస్టిక్ వర్క్ హక్కులున్నాయి. వాటిని ఏర్పాటుచేసిన వారికే అవి లభిస్తాయి. అయితే, ఈ నిబంధనలు ఉల్లంఘించి చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. వారి సంఖ్య కోట్లలో ఉండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదట. ఎందుకైనా మంచిది.. రాత్రి వేళ ఈఫిల్ టవర్‌తో ఫోటోలు దిగాలనుకుంటే ముందే డబ్బులు చెల్లించడం బెటర్.
మరిన్ని చదవండి ఇక్కడ : పవన్ కళ్యాణ్ పారితోషికంపై పోసాని సంచలన కామెంట్స్| Posani Vs Pawan Kalyan
Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zKtTJC
0 Response to "Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)"
Post a Comment