
Bike Stunts: బైక్ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు

విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ బైక్ స్టంట్స్‌పై సీపీ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్‌లపై యువకులు ఫీట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో లైక్లు కోసం బైక్లపై విన్యాసాలు చేయొద్దన్నారు. బైకులు సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.
ఇలాంటివి జరిగే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. విజయవాడలో ఇలాంటి రేసులు, విన్యాసాలు చేసే ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచుతున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలకు సంబంధించి గతంలోనే చర్యలు తీసుకున్నమని వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు.. వారి తల్లిదండ్రులను కూడా పిలిచి హెచ్చరించి పంపించామన్నారు.
ఏం జరిగిందంటే..
విజయవాడ నగరంలో బైక్ రేసర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. స్టంట్లు చేస్తూ భయపెడుతున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు…ఇప్పుడు నగరంలోని ప్రధానరహదారులపై నిర్వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Zojila Tunnel: వచ్చే ఏడాది నాటికి జోజిలా టన్నెల్ పనులు పూర్తి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
YouTube: యూట్యూబ్‌లో ఆత్మహత్య వీడియోను తల్లికి చూపించిన మైనర్ బాలిక.. తెల్లవారేసరికి షాక్..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kPpq3U
0 Response to "Bike Stunts: బైక్ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు"
Post a Comment