-->
DOST Admission 2021: డిగ్రీలో చేరేందుకు మరో ఛాన్స్.. దోస్త్‌ మూడో విడుత గడువు పొడగింపు..

DOST Admission 2021: డిగ్రీలో చేరేందుకు మరో ఛాన్స్.. దోస్త్‌ మూడో విడుత గడువు పొడగింపు..

Students

DOST Admission 3rd Phase Registration: కరోనా ప్రారంభం నాటినుంచి విద్యావ్యవస్థ కుంటుపడిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ అనంతరం.. డిగ్రీ విద్యార్థులకు అక్టోబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. డిగ్రీలో ప్రవేశాలకు.. ఇప్పటి వరకు రెండు విడుత‌ల అడ్మిషన్లు పూర్తికాగా, ప్రస్తుతానికి మూడో విడుత కొనసాగుతున్నాయి. తాజాగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మూడో విడుత దరఖాస్తుల గడువును పొడగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దోస్త్‌ మూడో విడుత రిజిస్ట్రేషన్లు సహా వెబ్‌ ఆప్షన్ల గడువును పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి బుధవారం వెల్లడించారు.

ఆయా షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఒకే కాలేజీలో కోర్సులు మార్చుకునేందుకు గాను ఇంట్రాకాలేజీలో వెబ్‌ ఆప్షన్ల షెడ్యూల్‌ను సైతం ఆయన ప్రకటించారు. డిగ్రీలో ప్రవేశాల కోసం రూ. 400 ఫీజుతో దోస్త్ రిజిస్ట్రేషన్ ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఉన్నట్లు తెలిపారు. వెబ్‌ ఆప్షన్లు 23వ తేదీ, సీట్లు కేటాయింపు 27, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్ 30, క‌ళాశాల‌లో రిపోర్టింగ్ 30వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఉన్నట్లు లింబాద్రి వెల్లడించారు. కాగా.. డిగ్రీలో ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే క్లాసులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచనలు సైతం చేశారు.

క్లాసులు ప్రారంభమైన వెంటనే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కళాశాలల్లో ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. విద్యాసంస్థల్లో 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ వ్యాక్సిన్ అందించాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు.

Also Read:

Hair Care Tips: హెన్నా వల్ల జుట్టు పొడిబారుతుందా..! అయితే ఈ 4 రెమిడిస్‌ తెలుసుకోండి..

గుడ్డు తినేవారికి హెచ్చరిక..! ఎక్కువగా తింటే ఈ 4 దుష్ప్రభావాలు ఉంటాయి..? అవేంటో తెలుసుకోండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39aGcUF

Related Posts

0 Response to "DOST Admission 2021: డిగ్రీలో చేరేందుకు మరో ఛాన్స్.. దోస్త్‌ మూడో విడుత గడువు పొడగింపు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel