-->
CSK vs MI IPL 2021: రెండో దశలో తొలి విజయం నమోదు చేసిన ధోనీ సేన.. ముంబయి ఇండియన్స్‌పై చెన్నై ఘన విజయం.

CSK vs MI IPL 2021: రెండో దశలో తొలి విజయం నమోదు చేసిన ధోనీ సేన.. ముంబయి ఇండియన్స్‌పై చెన్నై ఘన విజయం.

Ipl 2021

CSK vs MI IPL 2021: కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి జట్టు మొదటి నుంచి తడబడింది. ముంబయి ఇన్నింగ్స్‌లో తివారి(50) ఒక్కడే అర్థ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డికాక్ 17, సింగ్ 16, సూర్య కుమార్ యాదవ్ 3, ఇషాన్ కిషన్ 11, పొలార్డ్ 15, పాండ్యా 4, మిల్నే 15 పరుగులు చేశారు. చెన్నై టీం బౌలర్లలో బ్రావో 3, దీపక్ చాహర్ 2, హజల్ వుడ్, శార్దుల్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో చెన్నై విజయాన్ని అందుకుంది.

ఇక అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ ధోనీ(3), రైనా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్‌(88) ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.

Also Read: Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్న విరాట్ కోహ్లీ.. 15వ సీజన్‌లో ప్లేయర్‌గానే బరిలోకి..!

Bigg Boss OTT: బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌గా దివ్య అగర్వాల్‌.. అసలు ఈ బిగ్‌బాస్‌ ఓటీటీ ఏంటీ? ఎవరీ దివ్య.?

Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3znTWWR

Related Posts

0 Response to "CSK vs MI IPL 2021: రెండో దశలో తొలి విజయం నమోదు చేసిన ధోనీ సేన.. ముంబయి ఇండియన్స్‌పై చెన్నై ఘన విజయం."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel