-->
Covid-19 vaccine: మార్కెట్‌లో నకీలి వ్యాక్సిన్లు..! అసలైన టీకాలను ఇలా గుర్తించండి.. కేంద్రం మార్గదర్శకాలు..

Covid-19 vaccine: మార్కెట్‌లో నకీలి వ్యాక్సిన్లు..! అసలైన టీకాలను ఇలా గుర్తించండి.. కేంద్రం మార్గదర్శకాలు..

Fake Covid 19 Vaccines

Fake Covid-19 vaccines: దేశంలో కరోనావైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవిడ్‌ నకిలీ టీకాలు కూడా మార్కెట్‌లో వస్తున్నాయన్న సూచనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలకు ఇస్తున్న కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వీ టీకాల్లో ఏవి అసలైనవి? ఏవి నకిలీవి? అన్నది గుర్తించడానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకాలు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో భారత్‌లోనూ నకిలీ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్ల ప్యాకింగ్‌కు సంబంధించి పలు వివరాలను పంచుకుంది. నిజమైన కరోనా టీకాలు ఇలా ఉంటాయంటూ పలు సూచనలు చేసింది.

నిజమైన టీకాలు ఎలా ఉంటాయంటే..?
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌
➼ వ్యాక్సిన్‌ వయల్‌పై ఆకుపచ్చ రంగు (ప్యాంటోన్‌ 355సీ) తో కవర్‌ ఉంటుంది. దానిపై ఎస్‌ఐఐ లోగో స్పష్టంగా కనిపిస్తుంది.

➼ టీకా సీసా మూతపై ముదురు ఆకుపచ్చ అల్యూమినియం సీల్‌ ఉంటుంది.
➼ ఆకుపచ్చ అక్షరాలతో తెల్లని లేబుల్‌పై కోవిషీల్డ్‌ అనే ట్రేడ్‌మార్క్‌ రాసి ఉంటుంది.
➼ వ్యాక్సిన్‌ జనరిక్‌ పేరు సన్నటి అక్షరాలతో ఉంటుంది.
➼ లేబుల్‌పై ‘సీజీఎస్‌ నాట్‌ ఫర్‌ సేల్‌’ అనే ఇంగ్లిష్‌ అక్షరాలు ఎరుపు రంగుతో అడ్డంగా ప్రింట్‌ చేసి ఉంటుంది.
➼ తేనెతుట్టె గూళ్ల మాదిరిగా సీసాపై డిజైన్‌ అక్కడక్కడ కనిపిస్తుంది. ఇది క్షుణ్ణంగా పరీక్షిస్తేనే కనిపిస్తుంది.

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌
➼ వ్యాక్సిన్‌ వయల్‌ లేబుల్‌పై డీఎన్‌ఏ నిర్మాణాన్ని పోలిన యూవీ హెలిక్స్‌ డిజైన్‌ ఉంటుంది. యూవీ కాంతితో మాత్రమే దీన్ని గుర్తించడం సాధ్యమవుతుంది.
➼ సీసా లేబుల్‌పై కనిపించని విధంగా చిన్నచిన్న మైక్రో బిందువులు కోవాగ్జిన్‌ పేరుతో ఉంటాయి.
➼ లేబుల్‌పై లేత సముద్రపు నీలిరంగులో ‘కోవాగ్జిన్‌’ పేరు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. పేరులో ‘ఎక్స్‌’ (X) అక్షరం ఆకుపచ్చ రంగులో మిళితమై ఉంటుంది.

➼ కోవాగ్జిన్‌ పేరుపై హోలోగ్రాఫిక్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌
➼ 2 రకాల లేబుల్స్‌తో ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ వయల్స్‌ ఉంటాయి.
➼ వ్యాక్సిన్ సమాచారం, డిజైన్‌ అంతా ఒకేలా ఉన్నప్పటికీ, తయారీదారు పేర్లు వేర్వేరుగా రాసి ఉంటాయి.

➼ అక్షరాలన్నీ రష్యన్‌ భాషలో ఉంటాయి.
➼ ఐదు వయల్స్‌ కలిగిన ఒక్కో కార్టన్‌ ప్యాక్‌పై ఇంగ్లీష్ అక్షరాలతో లేబుల్స్‌ రాసి ఉంటాయి.

Also Read:

Children Health: కొవిడ్ నేపథ్యం: చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టిన అధ్యయనం

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BMncIe

Related Posts

0 Response to "Covid-19 vaccine: మార్కెట్‌లో నకీలి వ్యాక్సిన్లు..! అసలైన టీకాలను ఇలా గుర్తించండి.. కేంద్రం మార్గదర్శకాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel