-->
Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్..

Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్..

Shanmukh

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి మొదలైంది. ఆదివారం (సెప్టెంబర్ 5) సాయంత్రం 6 గంటలకు ఈ షో గ్రాండ్‏గా ప్రారంభమైంది. ఇక స్టేజ్ పైకి.. తనయుడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక లైలా కోసం స్టెప్పులేశారు. ఇక ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్స్ తమ తమ సాంగ్స్‏తో ఎంట్రీ ఇచ్చారు. సిరి, సన్నీ, లహరి, శ్రీరామ చంద్ర ఇలా అందరూ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్లారు. ఇక పదో కంటెస్టెంట్‏గా పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలోని హూ ఆర్ యూ అనే పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్..

అయితే రావడంతోనే షణ్ముఖ్ తరచూ ఉపయోగించే అరె ఎంట్రా ఇది అంటూ నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత.. షణ్ముఖ్‏పై ప్రశ్నలు సంధించాడు నాగ్. పాపులర్ యూట్యూబర్‏వి కదా.. అంటే సోషల్ మీడియాలో పాజిటివిటీతోపాటు నెగెటివిటీ కూడా ఉంటుంది కదా ? అంటూ ప్రశ్నించాడు నాగ్. దీంతో షణ్ముఖ్ స్పందిస్తూ.. కొన్ని రోజుల క్రితం ఓ ఘటన జరిగింది. అది రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తు్న్నాను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక రావడంతోనే తన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు షణ్ముఖ్. అయితే ఇంట్లో ఉన్న నెగెటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తావని స్టేజ్ మీదే షణ్ముఖ్‏ను ప్రశ్నించారు నాగ్. దీంతో షణ్ముఖ్ తను ఇంకా ఏం ప్రిపేర్ కాలేదని.. అన్నింటిని కొత్తగా ఆస్వాదించాలనుకుంటున్నట్లుగా తెలిపాడు.

Also Read: Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

Pawan Kalyan- Mogulaiah photos: మరోసారి చాటుకున్న రీల్ భీమ్లా నాయక్ మంచి మనసు.. మొగులయ్యకు ఆర్థిక సాయం ఫొటోస్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3n5gUiV

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel