
Bigg Boss 5: బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నా వల్లకాదు.. ఓపెన్ అయిన లోబో..

Bigg Boss 5: బిగ్ బాస్ హంగామా రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు కూడా అదే గొడవలు అదే గోలలతో సందడిగా సాగింది బిగ్ బాస్. అయితే హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి తన మాటలతో సందడి చేస్తున్న లోబో ఈ సారి సహనం కోల్పోయాడు. మొన్నటికి మొన్న షణ్ముఖ్ బిగ్ బాస్ గేమ్ ఆడటం నావల్లకాదు.. బయటకు వెళ్లి వీడియోలు చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లోబో కూడా అదే బెటర్ అంటున్నాడు.. బిగ్ బాస్ నా వల్లకాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు లోబో. మొదటి నుంచి ఇంటి సభ్యులతో చాలా సరదాగా ఉంటూ సందడి చేస్తున్నాడు లోబో. దాదాపు అందరితో కలివిడిగా ఉంటూ వస్తున్న లోబో.. తాజా ఎపిసోడ్‌లో ఓపెన్ అయ్యాడు. ముందుగా షణ్ముఖ్‌కి సేవకుడిగా ఉన్న లోబోకి పనులు చెప్పడం.. దానికి రవి సలహాలు తీసుకోవడం జరిగింది. ఆతర్వాత విశ్వ దగ్గరకు వెళ్లిన లోబో..బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నాకు సెట్ కావు.. నేను నా లెక్కనే ఉంటున్నా.. ఇది నా టేస్ట్ కాదు.. అందుకే నాకు ఈ బిగ్ బాస్ నచ్చడం లేదు. పోయి నా దుకాణంలో ఉంటా’ అని ఫీల్ అయ్యాడు లోబో.
ఆ తర్వాత ప్రియాంక సింగ్ కు లై వేసే ప్రయత్నం చేశాడు లోబో.. దాంతో ప్రియాంక రియాక్ట్ అవుతూ.. నీకు దమ్ము ఉంటే మానస్ ముందు నాకు లైన్ వేయి అని సవాల్ చేసింది.. ఆ తర్వాత లోబో మానస్ దగ్గరకు వెళ్లి నేను ప్రియాంకకి లైన్ వేస్తుంటే.. నన్ను అన్నయ్య అంటుంది ఏంటి మానస్..? అని లోబో అన్నాడు. దానికి మానస్ సరదాగా స్పందిస్తూ.. నువ్ మనస్పూర్తిగా ట్రై చేసుకో.. మధ్యలో నా పర్మిషన్ ఎందుకు అని అన్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bigg Boss 5: బిగ్ బాస్: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ.. హౌస్‌కు తొలి కెప్టెన్‌గా చలాకీ సిరి.!
Bigg Boss 5 Telugu: భయమా..? లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా..? కెమెరాకు కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ…
Bigg Boss 5 Telugu: నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‌కే.. బిగ్‌బాస్ షోపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yYGIzA
0 Response to "Bigg Boss 5: బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నా వల్లకాదు.. ఓపెన్ అయిన లోబో.."
Post a Comment