-->
Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..

Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..

Rape Case

Hyderabad Crime News: అభంశుభం తెలియని ఓ చిన్నారిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపాడు. ఈ దారుణ సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నగర పరిధిలోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల పసిపాపపై.. ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ ఘటన గురువారం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. అనుమానం వచ్చి అదే ప్రాంతంలో జులాయిగా తిరుగుతున్న రాజు ఇంటిని పరిశీలించగా.. పాప విగత జీవిగా పడిఉన్నట్లు స్థానికులు తెలిపారు. రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ దుర్వ్యసనాలకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో పాపపై కన్నేసి అత్యాచారం చేసి హత్యచేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. నిందితుడిని తమకు అప్పగించే వరకు బాలిక మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేదిలేదని బస్తీవాసులు పట్టుబట్టి ఆందోళన చేస్తున్నారు.

కాగా.. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు రాజు కోసం వెతుకుతున్నారు. బాలికను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

కాగా.. నల్గొండ జిల్లా చందంపేట్ మండలానికి చెందిన రాజు నాయక్ పొట్టకూటి కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. సాయంత్రం నుంచి పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది.. వెతికారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో రాజుపై అనుమానం వచ్చి.. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. అతని ఇంట్లో బాలిక విగతజీవిగా పడివుంది. బాలికను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

నడి రోడ్డుపై బాలుడి తల.. రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీసు బృందాలు.. మృతదేహం కోసం గాలింపు..!

Corona Vaccine: ఇలా అయితే మీకు కరోనా నుంచి బులెట్ ప్రూఫ్ రక్షణ దొరికినట్టే.. ఎలాగో తెలుసుకోండి!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BWnYT3

Related Posts

0 Response to "Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel