-->
Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..

Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..

Priya

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో నాగార్జున చెప్పినట్టే 5 రేట్లు ఫన్ జనరేట్ అవుతుంది. అలాగే ఏడుపులు, గొడవలు, అల్లర్లతో నానా హంగామాగా ఉంది బిగ్ బాస్ హౌస్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 18మంది ఉన్నారు. ఇక ఇంటిసభ్యులకు బిగ్ బాస్ ఇస్తాన్న టాస్కులు.. దాన్లో గెలవడానికి హౌస్ మేట్స్ పడుతున్న పట్లు అన్ని ఇన్ని కావు. ఇక బిగ్ బాస్ 12వ రోజు ఇంటిసభ్యుల్లో ప్రియా కాజల్ మధ్య వార్ జరిగింది. నాకు వంట రాదు. నేనెప్పుడూ కిచన్ మొహంకూడా చూడలేదు అంటూ చెప్పుకునే కాజల్‌కు ఆ పనే పడింది. ఈ విషయం పై కాజల్‌కు ప్రియకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరి పై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ రచ్చ చేశారు. నీకు శాస్తి జరగాల్సిందే అని ప్రియా కాజల్‌ను అన్నదంట దాంతో గొడవ మొదలైంది.

నేను కిచన్  పనులు చేస్తుంటే మీరు ఫీల్ అవుతున్నారా. ? అని ప్రియను కాజల్ ఓ సందర్భంలో అడిగిందట. దానికి ప్రియా నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని ప్రియా చెప్పిందట. అయితే ప్రియా అలా చెప్పడం తనకు నచ్చ లేదు అని కాజల్ పెద్ద రచ్చ చేసింది. దాంతో ప్రియా ఫైర్ అయ్యింది. మాటలు మార్చుతోంది.. విశ్వ చెబితేనే చేస్తోందని అంటోంది.. కానీ విశ్వతో వేరేలా చెబుతోంది.. అమ్మో దండం నీకు.. ఈ ఆడది దారుణంగా ఉంది..  అని కాజల్ గురించి ప్రియ చెప్పింది. కెప్టెన్సీకి నువ్ అర్హురాలివి కాదు అని అంటే నీకు ఎలా ఉంటుంది.. అని కాజల్‌ ప్రియను అడగడంతో.. ప్రియ హర్ట్ అయ్యింది. అదీ ఇదీ ఒకటేనా.? పనులు చేయడం నీ బాధ్యత.. నీ బాధ్యతను నువ్ చేస్తుంటే.. నేను ఎందుకు ఫీల్ అవుతాను అంటూ కాజల్‌కు ప్రియ కౌంటర్ వేసింది. దాంతో కాజల్ మొహం వాడిపోయింది. ఇక బాధపడుతున్న కాజల్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పింది ప్రియా దాంతో ఈ రచ్చకు పులిస్టాప్ పడింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: బసవతారకంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యం: బాలకృష్ణ

Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?

బిగ్ బాస్ 5: అమాంతం పెరిగిన చలాకీ సిరి క్రేజ్.. టాప్ 5 కంటెస్టెంట్లలో చోటు దొరికేనా.?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EvSVji

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel