-->
Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అసలు సిక్రెట్‏ను బయటపెట్టేసిన యానీ మాస్టర్..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అసలు సిక్రెట్‏ను బయటపెట్టేసిన యానీ మాస్టర్..

Bigg Boss

బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. ఇంట్లో 12వ రోజున ఫన్నీగా.. మళ్లీ గొడవలతో సాగిపోయింది. మరోసారి కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. వినూత్నంగా ప్రేమలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పటివరకు గొడవలతో.. అరుపులతో నెట్టుకొచ్చిన కంటెస్టెంట్స్ ఈసారి లవ్ ట్రాక్స్ నడిపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శ్రీరామ చంద్ర, లహరి, మానస్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని… అటు కంటెస్టెంట్స్ అంటుండమే కాకుండా.. బిగ్‏బాస్ కూడా అదే రేంజ్‏లో సందేహాలను కలిగిస్తూ… వారిపైనే స్క్రీన్ ఫోకస్ అయ్యేలా చూసుకుంటున్నాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్‏లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఆర్ఆర్ఆర్ దోస్తీ పాటతో బిగ్ బాస్ తన ఇంటిసభ్యులను నిద్రలేపాడు. ఆ తరువాత విశ్వ కొత్త కెప్టెన్‌గా ఇంటి సభ్యులకు నియమ నిబంధనల ఉల్లంఘన గురించి మాట్లాడాడు. ఆ తరువాత బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే టాస్క్ గురించి ప్రియ బిగ్ బాస్ లెటర్‌ను చదివింది. ఇక కంటెస్టెంట్లు బజర్‌ మోగగానే బంతిని పట్టుకోవాలి. ఒక్కో బాల్ మీద ఒక్కో ఐటం పేరు రాసి ఉంటుంది. ఆ బాల్ పట్టుకుంటే.. ఆ ఫుడ్ ఇంటి సభ్యుల సొంతం అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ లగ్జరీ బడ్జెట్ గురించి జెస్సీ, శ్వేత కాసేపు కామెడీ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే టాస్క్ కంప్లీట్ చేశారు ఇంటి సభ్యులు. ఈ గేమ్ తర్వాత.. స్ట్, వరెస్ట్ పర్ఫార్మర్‌లను ఏకాభిప్రాయంతో ఎంచుకోమన్నాడు బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఎక్కువ మంది నటరాజ్ మాస్టర్‌ను బెస్ట్ పర్ఫార్మర్, సన్నీని వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఫన్నీ గేమ్ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్ రిపోర్టర్స్‏గా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్స్‏ను ప్రశ్నించారు. మొదటగా.. పెళ్లి కాకపోయుంటే ఇంట్లో ఎవరికి సైట్‌ కొట్టేవాళ్లు అని కాజల్‌ రవిని ప్రశ్నించగా కాజల్ అంటూ తన పేరే చెప్పాడు. దీంతో అవాక్కైన కాజల్‌ అంత సీన్‌ లేదులే అని నవ్వేసింది. తర్వాత యానీ మాస్టర్‌.. తనకు హౌస్‌లో పెద్ద కూతురు దొరికిందంటూ శ్వేత గురించి చెప్పింది. పనిలో పనిగా శ్రీరామ్‌, హమీదా, సన్నీ మధ్యలో ట్రయాంగిల్‌ స్టోరీ నడుస్తుందని ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది.

Also Read: Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?

PM Modi Turns 71: ప్రధాని మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన సినీ సెల్రిటీలు.. పవన్, అక్కినేని నాగార్జున సహా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3i2WMuH

0 Response to "Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అసలు సిక్రెట్‏ను బయటపెట్టేసిన యానీ మాస్టర్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel