-->
Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ.. భారీ స్కేచ్‌..!

Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ.. భారీ స్కేచ్‌..!

Anandaiah

Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం మొదలైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పేరు ఇటీవల మారు మోగిపోయింది. కరోనా రోగుల కోసం మందు తయారు చేసిన ఆనందయ్య.. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆయుర్వేదం మందు తయారు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు. జిల్లాలు, గ్రామాల్లో కూడా కరోనా మందును ప్రజలకు అందజేశారు. రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఆనందయ్య నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న సమయంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి ఆనందయ్య వార్తల్లో నిలిచారు. ఆనందయ్య మందు కొంతకాలం ఆగిపోయిన తర్వాత ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో మందు పంపిణీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అఖిల భారత యాదవ మహాసభ 13 జిల్లాల సమైఖ్య సమావేశ యాత్ర సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందయ్య మాట్లాడుతూ.. జగన్ సర్కారుపై సంచలన కామెంట్స్ చేశారు. కరోనా మందు తయారీకి జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. త్వరలోనే యాదవుల రాజకీయ పార్టీ ప్రారంభిస్తామని ప్రకటించారు. మిగిలిన బీసీ కులాలతో కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు  తెలిపారు.

వచ్చే ఏడాది రథయాత్రకుఏ సన్నాహాలు..

వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆనందయ్య చెప్పుకొచ్చారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని ఆనందయ్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం నుంచి సహకారం లేదని కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసినా.. 13 జిల్లాల్లో కూడా ఆయుర్వేదం మందును పంపిణీ చేశారు. స్వయంగా ఆనందయ్యే మందును తయారు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇవీ కూడా చదవండి:

Andhra Pradesh: ఆ రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇవే..

Health Benefits: పెరుగు, దానిమ్మ, పాలకుర, నిమ్మ, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zKtJBW

Related Posts

0 Response to "Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ.. భారీ స్కేచ్‌..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel