-->
Weight Loss Diet: బరువు తగ్గాలంటే ఈ 4 పవర్ ఫుల్ చిట్కాలు పాటించాల్సిందే.. ఏం తింటారో మీ ఇష్టం.. కానీ..!

Weight Loss Diet: బరువు తగ్గాలంటే ఈ 4 పవర్ ఫుల్ చిట్కాలు పాటించాల్సిందే.. ఏం తింటారో మీ ఇష్టం.. కానీ..!

Food

Weight Loss Diet: చలికాలంలో బరువు విపరీతంగా పెరుగుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు కొన్ని మంచి చిట్కాలు అందిస్తున్నారు. అయితే ఇందులో మీరు ఏదైనా నిర్దిష్ట ఆహారానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేకపోవడం విశేషం. ఎన్నో డైట్‌లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ, అవి మీ బరువు తగ్గే లక్ష్యానికి దూరంగానే ఉంటాయి. మీరు భోజనాన్ని స్కిప్ చేస్తూ, ఇతర పోషకాలను అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

శాశ్వతంగా బరువు తగ్గడం అనేది జీవితాంతం ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పిస్తుంది. అయితే నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితం చేసుకుంటే మాత్రం మీ బరువు తగ్గే లక్ష్యానికి చాలా దూరంలో ఉండిపోతారు. అయితే పోషకాహార నిపుణులు స్థిరంగా బరువు తగ్గడానికి నాలుగు సాధారణ చిట్కాలను నెట్టింట్లో పంచుకున్నారు. అయితే ఇందులో ఏదైనా నిర్దిష్ట ఆహారానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది.

పోషకాహార నిపుణుడు అజ్రా ఖాన్ “బరువు తగ్గడానికి రహస్య సూత్రాలను” వెల్లడిస్తూ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలని పేర్కొంది. “మీరు తినాలి కాబట్టి తినవద్దు. మీ శరీరం చెప్పే మాట వినండి. అవసరమైనప్పుడు మాత్రమే ఆహారం ఇవ్వండి” అని ఆమె తెలిపింది. ఇందుకోసం ఆమె నాలుగు చిట్కాలు పేర్కొంది. ఆకలిగా ఉంటేనే తినాలి, కడుపు ఫుల్‌గా ఉన్నా తినడం ఆపాలి, తినే ప్రతీ ఆహారాన్ని నమిలి తినాలి, మీకు నచ్చింది మాత్రమే తినాలి అంటూ వాటిని వివరించింది.

అలాగే తినే సమయంలో టీవీలకు అతుక్కుపోయి, ఎంత తింటున్నామో కూడా పట్టించుకోరు. మనలో చాలా మంది శరీర సంకేతాలను పట్టించుకోరు. దీంతో శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది.

“మనం తినడం ప్రారంభించిన 20 నిమిషాల తర్వాత మన మెదడుకు మనకు సంతృప్తి హార్మోన్ లెప్టిన్ నుంచి సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఆహారాన్ని నమిలి ఆస్వాదించండి. తద్వారా మీరు సంతృప్తి సంకేతాలను పొందుతారు” అని ఆమె పేర్కొంది.

ప్రతీ ఆహారాన్ని తినడం కాదు. ఎవరికి ఏది సరిపోతుందో దాని ఆధారంగా ఆహారాన్ని ఎంచుకోవాలి” అని పేర్కొంది. అందరూ పాటిస్తున్నారనే కారణంతో కీటో పాలియో, లో కార్బ్, హై కార్బ్ అంటూ ఏది పడితే అది ట్రై చేయకూడదు. మీకు ఏది మంచిదో అది మాత్రమే తినండి” అని ఖాన్ పేర్కొంది.

Also Read: Heart: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఇలా చేయండి.. లేకుంటే అంతే..

Weight Gain: చలికాలంలో ఎందుకు బరువు పెరుగుతారు.. నిపుణులు ఏమంటున్నారంటే?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GFwDeZ

0 Response to "Weight Loss Diet: బరువు తగ్గాలంటే ఈ 4 పవర్ ఫుల్ చిట్కాలు పాటించాల్సిందే.. ఏం తింటారో మీ ఇష్టం.. కానీ..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel