
Viral Video: హాయిగా కూర్చున్న పిల్లిని హడలెత్తించిన తాబేలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..

Viral Video: జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్నీ భీకరంగా, భయోత్పాతంగా ఉంటే.. మరికొన్ని ఆహ్లాదకరంగా, మనసుకి ఆనందాన్ని కలిగించేలా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. కుక్కలు, పిల్లులు, కోతులకు సంబంధించి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు అనే చెప్పాలి. నెటిజన్లు ఈ వీడియోల పట్ల తెగ ఆసక్తి చూపుతారు. తాజాగా అలాంటి అందమైన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రశాతంగా కూర్చున్న పిల్లిని.. ఓ రాకాసి తాబేలు ఎలా హడలెత్తించిందో ఈ వీడియోలో ఉంది. దాన్ని చూస్తే మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం అనే చెప్పాలి.
ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏముందో చూద్దాం.. ఓ పిల్లి రోడ్డు పక్కన మూలకు ప్రశాంతంగా కూర్చుంది. అదే సమయంలో ఓ తాబేలు ఆ పిల్లిని సమీపించింది. అప్పటి వరకు పిల్లి ఏమాత్రం భయపడలేదు. అయితే, నెమ్మదిగా దగ్గరికి వచ్చిన తాబేలు.. ఒక్కసారిగా పిల్లిపై అటాక్ చేసింది. దానిని హడలెత్తించింది. తాబేలు ఇచ్చిన ఝలక్‌లో పిల్లి బెంబేలెత్తిపోయింది. అక్కడి నుంచి పరుగులు తీసింది. తాబేలు దెబ్బకు పిల్లి అబ్బా అంటూ పక్కకు పోయింది. అయితే, తాబేలు అటాక్‌కు సంబంధించిన వీడియోను wonderfuldixe పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో షేర్ చేశారు. దాతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు దీనిని 2.36 లక్షల మంది వీక్షించారు. వేలాది లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పాపం పిల్లి అంటూ దానికి సానుభూతి తెలుపుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GgMxwr
0 Response to "Viral Video: హాయిగా కూర్చున్న పిల్లిని హడలెత్తించిన తాబేలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే.."
Post a Comment