
Viral Video: నెటిజన్లను ఫిదా చేస్తోన్న చిన్నారి.. ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా.. వైరలవుతోన్న వీడియో..!

Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం అని చాలా మంది అనడం మనం వింటూనే ఉంటాం. పిల్లల హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వారికి మోసం అనేది తెలియదు. దేవుడు కూడా వీటన్నింటికి అతీతుడు అని నమ్మడం వల్లనే పిల్లలను భగవంతుని మరో రూపంగా భావిస్తారు. పిల్లలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని దయతో నిండి ఉన్నాయి. అంటే పిల్లలలో దయ కనిపిస్తుందనడంలో సదేహం లేదు. అలాంటి వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక చిన్న అమ్మాయి అలాంటి పనే చేసింది. ప్రజలు ఆమెను ప్రశంసించడంలో మునిగిపోయారు.
ఓ షాపులో బన్‌ను కొని కుక్కకు తినిపించింది. ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఒక చిన్న అమ్మాయి దుకాణానికి వచ్చి దుకాణదారునికి డబ్బు చెల్లించి బన్‌ను కొనుగోలు చేయడం, దుకాణం ముందు కూర్చున్న కుక్కకు అందించడం వీడియోలో చూడవచ్చు. ఆమె మొదట బన్‌ను తన చేతితో కుక్కకు తినిపించి, మిగిలిన భాగాన్ని దానికే విసురుతుంది. అంతే కాదు, తినిపించిన తర్వాత తన చేతితో కుక్క వైపు చూపిస్తూ గుడ్ బై చెప్పింది.
ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ‘వయస్సు, యవ్వనం, హృదయం చాలా పెద్దది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ‘సాధించడం’ నేర్పుతారు. ఈ బిడ్డకు ‘ఇవ్వడం’ నేర్పిన తల్లిదండ్రులు ధన్యులు..’ అంటే రాసుకొచ్చారు. ఈ 12 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 16 వేలకు పైగా వీక్షించగా, 1,400 మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
उम्र छोटी और दिल इतना बड़ा…
ज्यादातार पेरेंट्स बच्चों को ‘हासिल करना’ सिखाते हैं. धन्य हैं वो मां-बाप जिसने इस बच्चे को ‘देना’ सिखाया…#HelpChain#kindness #KindnessMatters #bekindalways pic.twitter.com/s9QsBMCBRb
— Dipanshu Kabra (@ipskabra) December 11, 2021
Priyanka Gandhi: గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31VC2zQ
0 Response to "Viral Video: నెటిజన్లను ఫిదా చేస్తోన్న చిన్నారి.. ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా.. వైరలవుతోన్న వీడియో..!"
Post a Comment