
Viral Video: వరుడి వింత చేష్టలు.. వాన వెలిసేదాక ఆగలేకపోయాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..!

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతినిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లు మురిపిస్తున్నాయి. ఇక కరోనా కాలం నుంచి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు మాత్రం కో కొల్లలుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వధువరులకు సంబంధించి పెళ్లి తంతులోని వింత సంఘటనలు, విచిత్ర సంప్రదాయాలు ఇంటర్‌నెట్ ప్లాట్‌ఫామ్ వేదికగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జోరువానలో బయల్దేరిన పెళ్లిబృందం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ వైపు కుండపోత వర్షం పడుతుంది. మరోవైపు ఓ పెళ్లి బృందం జోరువానలోనే ఊరేగింపుతో వెళ్తోంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు బంధుమిత్రులు సైతం వానలోనే గొడుగులు పట్టుకుని మరీ తడుస్తూ పెళ్లి బరాత్ కొనసాగిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. వరుడు వధువుతో పాటే.. గొడుగు అడ్డం పెట్టుకుని గుర్రంపై వెళ్తున్నాడు. మిగిలిన పెళ్లివారంతా అదిరిపోయే ముస్తాబుతో బురద నీటిలోనే నడుచుకుంటూ పెళ్లి నడక సాగిస్తున్నారు. అందరూ గొడుగు పెట్టుకున్నారనుకోండి.. అది లేని వారు కొందరు ఏకంగా ఏదో పెద్ద సైజున్న బౌల్ నెత్తిమీద బోర్లా పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకొందరు చెప్పులు, షూ చేతపట్టుకుని తప్పదురా అన్నట్టుగా పయనిస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వీడేం ఆత్రం పెళ్లి కొడుకురా బాబు.. వాన వెలిసేదాకా కూడా ఆగలేక పోయాడా..? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీడి పెళ్లి మీ తలనొప్పికి వచ్చిందిలేండీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3dcVo5Q
0 Response to "Viral Video: వరుడి వింత చేష్టలు.. వాన వెలిసేదాక ఆగలేకపోయాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..!"
Post a Comment